Anushka Sharma : ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్‌లో అనుష్క శర్మ చేతికి ధరించినది ఏంటో తెలుసా? ఫోటోలు వైరల్..
ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma ) హాజరు అయ్యారు.
IPL 2026 RCB vs GT What is that Anushka Sharma is wearing
- ధర్మశాల వేదికగా ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్
- స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన కోహ్లీ భార్య
- అనుష్క చేతికి పెట్టుకున్న రింగ్ పై సర్వత్రా ఆసక్తి
Anushka Sharma : ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజేతగా నిలిచి వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌కు ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సతీమణి బాలీవుడ్ నటి అనుష్క శర్మ హాజరైంది. స్టాండ్స్‌లో కూర్చుని తన భర్త కోహ్లీతో పాటు ఆర్సీబీ జట్టును ప్రోత్సహించింది.
ఆర్సీబీ విజయం సాధించాలని ఆమె ప్రార్థించడం కనిపించింది. ఇక ఆమె ప్రార్థిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. ఆమె తన వేలికి రాధా నామ జపమాల ఉంగరాన్ని పెట్టుకుని కనిపించింది. ఒకానొక సందర్భంలో మ్యాచ్‌లోని ఉద్రిక్త క్షణాలలో అనుష్క చేతులు జోడించి ప్రార్థిస్తున్నట్లుగా కూడా కనిపించింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Shubman Gill : ఆ ఒక్కటే మా కొంపముంచింది.. లేదంటేనా.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కామెంట్స్..
Anushka Sharma wearing
RADHA NAAM Jap counter in her fingerLook how she’s praying for RCB
I remembering the past years of RCB (:#RCBvsGT pic.twitter.com/WGbXgxBgWn— MR. SINGH (@DIVYANSHU_89632) May 26, 2026
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజత్ పాటిదార్ (33 బంతుల్లో 93 నాటౌట్) అర్థశతకం చేశాడు. కోహ్లీ (25 బంతుల్లో 43 పరుగులు), కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 43 పరుగులు) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ, జేసన్ హోల్డర్ చెరో రెండు, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశాడు.
Anushka Sharma was chanting with full devotion but Virat Kohli still couldn’t reach a half-century 😭🏏📿 pic.twitter.com/ZYxzURJh1w
— Shakur Surve (@Shakurs17) May 26, 2026
ఆతరువాత 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో రాహుల్ తెవాటియా (43 బంతుల్లో 68 పరుగులు) రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో జాకఫ్ డఫీ మూడు, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం దార్, కృనాల్ పాండ్యా తలా రెండు వికెట్లు, జోష్ హేజిల్‌వుడ్ ఓ వికెట్ తీశాడు.
