James : పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. రిలీజ్ థియేటర్స్..

పునీత్ చివరి సినిమా కావడంతో 'జేమ్స్' ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. కేవలం ఒక్క కర్ణాటకలోనే 65 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. రెస్టాఫ్ ఇండియా మరో 10 కోట్ల బిజినెస్.......

James : పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. రిలీజ్ థియేటర్స్..

Puneeth Rajkumar :  కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం అభిమానులకు, కన్నడ చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు కన్నడ ప్రజలకు కూడా నేటికీ తీరని లోటు. గతేడాది అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించారు. పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు మార్చి 17 పునీత్‌ జయంతి సందర్భంగా ‘జేమ్స్’ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. కన్నడతో పాటు హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

పునీత్ చివరి సినిమా కావడంతో అభిమానులతో పాటు, కన్నడ ప్రజలు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ వీకెండ్ ఆదివారం వరకు కర్ణాటక లోని అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అయిపోయాయి. కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్, సినీ పరిశ్రమ ఈ వారం రోజులు ఇంకే సినిమా కర్ణాటకలో రిలీజ్ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. పునీత్ చివరి సినిమా కావడంతో ‘జేమ్స్’ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. కేవలం ఒక్క కర్ణాటకలోనే 65 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. రెస్టాఫ్ ఇండియా మరో 10 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. కన్నడ సినిమాల్లో ‘కెజీఎఫ్’ తప్ప మరే సినిమా ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు.

James : పునీత్ చివరి సినిమా ఇవాళే రిలీజ్.. కర్ణాటక థియేటర్స్ హౌస్ ఫుల్..

కర్ణాటకలో ఉన్న 700కి పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్, 250 మల్టిప్లెక్స్ థియేటర్స్ అన్నిటిలోనూ జేమ్స్ సినిమానే రిలీజ్ అవుతుంది. వారం రోజుల వరకు ఈ 1000 థియేటర్స్ లో జేమ్స్ సినిమానే ఆడుతుంది. ఇక తెలుగులో దాదాపు 250 థియేటర్లలో, హిందీలో దాదాపు 300 థియేటర్స్ లో జేమ్స్ సినిమా రిలీజ్ అవుతుంది. తమిళ్, మలయాళం, నార్త్, ఓవర్సీస్.. అన్ని కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4000 థియేటర్స్ లో జేమ్స్ సినిమాని భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక థియేటర్ల వద్ద అభిమానులు కోలాహలం మొదలైంది. పునీత్ భారీ కటౌట్స్, బ్యానర్స్ కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.