Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట నుండి మరో అప్‌డేట్ రానుందా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. దాదాపు రెండేళ్ల.....

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట నుండి మరో అప్‌డేట్ రానుందా..?

Another Update From Sarkaru Vaari Paata To Be Released

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. దాదాపు రెండేళ్ల తరువాత మహేష్ సినిమా వస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశేనా..?

కాగా ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో, పోస్టర్స్, రెండు సాంగ్స్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో సర్కారు వారి పాట చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న థమన్, ప్రస్తుతం టాప్ ఫాంలో ఉండటంతో ఈ సినిమా కోసం ఆయన ఎలాంటి ట్యూన్స్ ఇస్తున్నాడో ఇప్పటికే కళావతి, పెన్నీ సాంగ్స్‌తో ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా నుండి మరో కొత్త అప్‌డేట్ రాబోతుందా… అంటే అవుననే అంటున్నాయి చిత్ర వర్గాలు. ఉగాది కానుకగా ఈ సినిమా నుండి ముచ్చటగా మూడో పాటను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట.

కానీ సమయం సరిపోకపోవడంతో ఉగాది సందర్భంగా మూడో పాటను కాకుండా ఓ మాస్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక మహేష్ బాబు మాస్ అవతారంలో కనిపించడంతో ఈ సినిమా నుండి మరో అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే త్వరలోనే ఈ సినిమా నుండి మూడో పాటను రిలీజ్ చేసేందుకు థమన్ అండ్ టీమ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూడో పాట కూడా సాలిడ్‌గా ఉంటుందని, ప్రేక్షకులను అలరించే విధంగా ఈ పాట ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.

Sarkaru Vaari Paata: అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన థమన్!

మహేష్ సరికొత్త లుక్‌తో ఈ సినిమాలో కనిపిస్తుండగా, ఈ చిత్రంలో ఆయన సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్థిక నేరాల బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను వేసవి కానుకగా మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమా నుండి రాబోతున్న కొత్త అప్‌డేట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.