Manchu Vishnu : షాకింగ్ నిర్ణయం తీసుకున్న విష్ణు.. ఇకపై ‘మా’ కమిటీలో ప్రకాష్‌రాజ్ ప్యానెల్ లేనట్టే

ప్రకాష్ రాజ్ ప్యానల్ లో గెలిచిన వాళ్లంతా రాజీనామాలు చేశారు. ప్రకాష్ రాజ్ కూడా 'మా' ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఈ విషయంలో మంచు విష్ణు షాకింగ్ నిర్ణయం......

Manchu Vishnu :  షాకింగ్ నిర్ణయం తీసుకున్న విష్ణు.. ఇకపై ‘మా’ కమిటీలో ప్రకాష్‌రాజ్ ప్యానెల్ లేనట్టే

Manchu Vishnu (1)

Manchu Vishnu :  కొన్ని రోజుల క్రితం సినీ పరిశ్రమలో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత రచ్చ సృష్టించాయో మన అందరికి తెలిసిందే. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ, ఒకరిని ఒకరు దూషించుకుంటూ, వరుస ప్రెస్ మీట్లతో హడావిడి చేశారు. వీళ్ళు చేసిన ఈ రచ్చ జనరల్ ఎలక్షన్స్ ని మించిపోయింది. ఎలక్షన్స్ రోజు కూడా ఈ రెండు టీం మధ్య గొడవలు జరిగాయి. చివరికి మంచు విష్ణు ప్యానెల్ ‘మా’ ఎలెక్షన్స్ లో గెలిచి మంచు విష్ణు ‘మా’ ప్రెసిడెంట్ అయ్యాడు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ అంత బాగా రావడానికి కారణం అతనే : రాజమౌళి

ఆ తర్వాత ఎలక్షన్ రోజు చీటింగ్ చేశారు అంటూ ప్రకాష్ రాజ్ టీం ప్రెస్ మీట్ పెట్టి మరీ మరోసారి మంచు విష్ణు ప్యానల్ పై ఆరోపణలు చేశారు. అంతే కాక ప్రకాష్ రాజ్ ప్యానల్ లో గెలిచిన వాళ్లంతా రాజీనామాలు చేశారు. ప్రకాష్ రాజ్ కూడా ‘మా’ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే అప్పుడు మంచు విష్ణు వీటిని ఆమోదించలేదు. వాళ్ళతో మాట్లాడి కలిసి వర్క్ చేయడానికి ఒప్పిస్తాను అని తెలిపారు విష్ణు.

Pushpa : ‘పుష్ప’ ప్రమోషన్స్ చేస్తున్న డేవిడ్ వార్నర్.. తగ్గేదేలే అంటున్న బన్నీ

తాజాగా ఈ విషయంలో మంచు విష్ణు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ మరియు అతని ప్యానెల్ నుండి గెలిచిన వాళ్ళ రాజీనామాలను ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు ఆమోదించాడు. దీనిపై మాట్లాడుతూ.. దాదాపుగా నెల రోజుల పాటు అందరిని వెనక్కి తీసుకురావటానికి ప్రయత్నం చేశాను, అందరం కలిసి పని చేద్దాం అని అన్నాను, కానీ వాళ్ళు అంగీకరించలేదు. అందుకే వాళ్ళ రాజీనామాలను ఆమోదించాను అని తెలిపాడు. ‘మా’ అసోసియేషన్ వర్క్స్ నడిపించడానికి కొత్త సభ్యులను తీసుకున్నాను అని తెలిపాడు విష్ణు. మరి దీనిపై ప్రకాష్ రాజ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.