RRR : ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ అంత బాగా రావడానికి కారణం అతనే : రాజమౌళి

ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తున్నంతసేపు ఎవ్వరూ కళ్ళు కూడా మూయరు. 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూస్తుంటే.....

RRR : ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ అంత బాగా రావడానికి కారణం అతనే : రాజమౌళి

Rrr (1)

RRR :  స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ గా ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కింది. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వచ్చే మరో పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచుతున్నారు టీం. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకు చెందిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

Pushpa : ‘పుష్ప’ ప్రమోషన్స్ చేస్తున్న డేవిడ్ వార్నర్.. తగ్గేదేలే అంటున్న బన్నీ

ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తున్నంతసేపు ఎవ్వరూ కళ్ళు కూడా మూయరు. ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒకో షాట్ అద్భుతంగా ఉంటుంది. యాక్షన్, స్నేహం, దేశ భక్తి, ప్రేమ అన్ని అంశాలను కరెక్ట్ గా మేళవించి ఈ సినిమా ట్రైలర్ ని అద్భుతంగా తయారు చేసి రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి ఊహించనంత స్పందన లభించింది. ట్రైలర్ గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారు. చాలా మంది ట్రైలర్ ని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. అయితే అందరికి నచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం అతనే అంటూ రాజమౌళి ఓ ట్వీట్ చేశాడు.

Akhanda : ‘అఖండ’ కోసం అదిరిపోయే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది ఇతనే..

ఈ అద్భుతమైన ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి రాజమౌళి తాజాగా ఓ ట్వీట్ చేశారు. రాజమౌళి.. ట్రైలర్ కి వస్తున్న ఈ రోరింగ్ రెస్పాన్స్ అంతటికి వెనుక ఒకతని పాత్ర ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ ని ఎంతో ఓపికగా, అపారమైన కష్టం పెట్టి చాలా బాగా కట్ చేసినందుకు ఎడిటర్ ప్రవీణ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాని ట్వీట్ చేశారు. ట్రైలర్ ని అత్యద్భుతంగా ఎడిట్ చేసిన ఎడిటర్ ప్రవీణ్ కి అభినందనలు తెలుపుతూ రాజమౌళి ఈ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.