Pushpa2: ఏందిరా సామీ.. ఎక్కడ దొరుకుతాయి మీకు అంటోన్న మనోజ్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప - ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కాగా, పుష్ప2 చిత్రంలో మరో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ నటిస్తాడనే వార్తపై ఆయన ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు.

Pushpa2: ఏందిరా సామీ.. ఎక్కడ దొరుకుతాయి మీకు అంటోన్న మనోజ్!
ad

Pushpa2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప – ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలో బన్నీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పాత్రలో, ఊరమాస్ అవతారంలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. కాగా, ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప-2 చిత్రాన్ని తెరకెక్కించేందుకు సుకుమార్ అండ్ టీమ్ రెడీ అవుతోంది. ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది.

Pushpa2: పుష్ప రాజ్‌ను ఢీకొట్టేందుకు మరో బాలీవుడ్ యాక్టర్..?

అయితే ఈ సినిమాలో పుష్ప పాత్రను ఢీకొనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. కాగా, పుష్ప2 చిత్రంలో మరో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ నటిస్తాడనే వార్త ప్రస్తుతం సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ వార్తను చూసిన మనోజ్ బాజ్‌పేయ్ తాజాగా ఈ విషయంపై స్పందించాడు. పుష్ప2 సినిమాలో తాను నటిస్తుంది లేనిది అనే విషయంపై ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు.

Pushpa2: బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లను మించి పుష్ప.. తగ్గేదే లే!

తాను సౌత్ సినిమాల్లో నటించానని, అయితే పుష్ప2 సినిమాలో నటిస్తున్నానే విషయం తనకే తెలియదని ఆయన అన్నారు. ఇలాంటి వార్తలు మీకు ఎక్కడ దొరుకుతాయి రా నాయానా అంటూ ఓ వెబ్‌సైట్ లింక్‌కు ఫన్నీ ఇమోజీలతో రిప్లై ఇచ్చాడు ఈ వర్సటైల్ యాక్టర్. అయితే తాను భారీ బడ్జెట్ మూవీలకు ఇంపార్టెన్స్ ఇవ్వనని, కేవలం సినిమా కథలకే ఇంపార్టెన్స్ ఇస్తానని ఓ ఇంటర్వ్యూలో మనోజ్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా మనోజ్ బాజ్‌పేయ్ పుష్ప-2 సినిమాలో నటిస్తున్నాడనే వార్త ఫైర్ కాదు.. కేవలం ఫ్లవర్ అని ఈ హీరో చెప్పకనే చెప్పేశాడు.