Shampoo Marriage Cancel : కొంపముంచిన షాంపూ.. ఏకంగా పెళ్లే క్యాన్సిల్ అయ్యింది..!

తలకు రాసుకునే ఓ చిన్న షాంపూ కారణంగా ఏకంగా ఓ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే ఈ షాకింగ్ ఘటన అసోంలో చోటు చేసుకుంది.

Shampoo Marriage Cancel : కొంపముంచిన షాంపూ.. ఏకంగా పెళ్లే క్యాన్సిల్ అయ్యింది..!

Shampoo Marriage Cancel : ఏంటి టైటిల్ చూసి షాక్ అయ్యారా? షాంపూ ఏంటి? పెళ్లిని ఆపించడం ఏంటి? అనే ధర్మ సందేహం కలిగింది కదూ. అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదూ. కానీ, ఇది నిజమే. కామెడీగా అనిపించొచ్చు, కానీ వాస్తవం ఇదే. తలకు రాసుకునే ఓ చిన్న షాంపూ కారణంగా ఏకంగా ఓ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే ఈ షాకింగ్ ఘటన అసోంలో చోటు చేసుకుంది.

Also Read..Groom Nose Small : ఇదేందయ్యా ఇది.. ఏడా సూడలే.. వరుడి ముక్కు చిన్నగా ఉందని పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

అసోం రాష్ట్రం బార్పెటా జిల్లా హౌలీ ప్రాంతానికి చెందిన యువతికి పెళ్లి ఖాయమైంది. కాగా, అక్కడ ఓ సంప్రదాయం ఉంది. అదేంటంటే.. వివాహానికి ముందు వరుడి కుటుంబం సంప్రదాయబద్దంగా కొన్ని వస్తువులను వధువుకి పంపిస్తుంది. ఈ క్రమంలో వరుడు ఇంటి నుంచి కొన్ని సంప్రదాయ వస్తువులు వధువు ఇంటికి చేరాయి. అయితే, వరుడు పంపిన వస్తువుల్లో ఓ షాంపూ కొంప ముంచింది. ఆ షాంపూ వధువుకి నచ్చలేదు. అది చీప్ క్వాలిటీ షాంపూ అనిపించింది. అంతే.. వెంటనే వరుడికి ఘాటుగా వాట్సాప్ మేసేజ్ పెట్టింది. ‘నీ స్థాయి ఇంతేనా?’ అని అతడికి వాట్సాప్ చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఆ వాట్సాప్ మేసేజ్ చూసిన వరుడికి ఎక్కడో కాలింది. అవమానంగా ఫీల్ అయ్యాడు. అంతే.. నువ్వూ వద్దు, ఈ పెళ్లీ వద్దు అంటూ.. వెంటనే పెళ్లినే క్యాన్సిల్ చేసేశాడు. వరుడి నిర్ణయంతో వధువు కుటుంబం కంగుతింది. పెళ్లి కొడుకు నిర్ణయం వారిని షాక్ కి గురి చేసింది. దయచేసి పెళ్లి క్యాన్సిల్ చేయొద్దని అతడిని వేడుకున్నారు. వాళ్లు ఎంత నచ్చచెప్పినా వరుడు మాత్రం తగ్గేదేలే అన్నాడు. పెళ్లి క్యాన్సిల్ అంతే అని తెగేసి చెప్పాడు. దీంతో వధువు కుటుంబం కంగుతింది. ఏం చేయాలో అర్థం కాక వారు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు.

Also Read.. Bride And Groom Hookah Kiss : ఇదేం పైత్యం రా నాయనా..! పెళ్లి మండపంపైనే పొగ తాగుతూ లిప్‌కిస్ పెట్టిన వధువు.. వీడియో వైరల్

మొత్తంగా ఓ షాంపూ కారణంగా ఏకంగా పెళ్లే క్యాన్సిల్ కావడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో జోకులు కూడా పేలుతున్నాయి. దటీజ్ ద పవర్ ఆఫ్ షాంపూ.. ఏకంగా పెళ్లినే రద్దు చేయించింది అని ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.