Chiru 155: మెగా దూకుడు.. మరో సినిమా ప్రకటించేశారు!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఫుల్ స్వింగ్ మీదున్నాడు. అది అలాంటి ఇలాంటి దూకుడు కాదు. వరసపెట్టి సినిమాలను ఒకే చేస్తూ ఒకే చేసిన సినిమాలను వరస పెట్టి పట్టాలెక్కిస్తూ యంగ్ హీరోలకు..

Chiru 155: మెగా దూకుడు.. మరో సినిమా ప్రకటించేశారు!

Chiru 155

Chiru 155: మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఫుల్ స్వింగ్ మీదున్నాడు. అది అలాంటి ఇలాంటి దూకుడు కాదు. వరసపెట్టి సినిమాలను ఒకే చేస్తూ ఒకే చేసిన సినిమాలను వరస పెట్టి పట్టాలెక్కిస్తూ యంగ్ హీరోలకు కూడా అందనంత దూకుడు మీదున్నాడు. ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా లైన్లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమా విడుదలకి సిద్ధంగా ఉండగా గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. మరోపక్క యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో సినిమాను కూడా మొదలు పెట్టాడు.

Pushpa: బన్నీ మేనియా.. ఐకాన్ స్టార్‌పై టాలీవుడ్ ప్రశంసల వర్షం!

ఇవి నాలుగు సినిమాలు కాకుండా ఇప్పుడు చిరంజీవి మరో సినిమాను కూడా ఒకే చేయగా తాజాగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాతో మరో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములకి ఛాన్సిచ్చాడు చిరంజీవి. డివివి ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో ఈ క్రేజీ కాంబినేషన్ తెరకెక్కబోతోంది. బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంటే వెంకీ కుడుముల సినిమాను ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మిస్తున్న డీవీవీ దానయ్య నిర్మిస్తుండడం ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

OTT Release: ఈ వారం వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

ఒకవైపు ఆచార్య ఫైనల్ పనులు చేస్తూనే గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాల షూటింగ్స్ తో షటిల్ సర్వీస్ చేస్తున్న చిరంజీవి మిగతా రెండు సినిమాలను ఎలా చేశారన్నది మెగా అభిమానులు చర్చించుకుంటుందా మెగాస్టార్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో అరవైల్లో కూడా ఇరవై ఏళ్ల కుర్రాడిలా యమా దూకుడు మీదున్నాడు. వెంకీ కుడుముల ముందుగా మెగా తనయుడు చరణ్ కు ఈ కథ చెప్పి ఫైనల్ గా చిరుతో సినిమా ఒకే చేయించుకున్నాడు. మరి ఈ కథ ఏంటి.. డీవీవీ లాంటి హౌస్ నిర్మించే ఈ కథ ఏ స్థాయిలో ఉండనుందన్నది చూడాలి.