Pushpa: బన్నీ మేనియా.. ఐకాన్ స్టార్‌పై టాలీవుడ్ ప్రశంసల వర్షం!

నెక్ట్స్ లెవెల్ హీరో రేస్ లో టాప్ పొజిషన్ ఇప్పుడు బన్నీదే. అవును.. అల్లు అర్జున్ క్రేజ్ రోజురోజుకీ పీక్స్ ను టచ్ చేస్తోంది. ఈ విషయం ఇండస్ట్రీ పెద్దలే చెప్పేస్తున్నారు.

Pushpa: బన్నీ మేనియా.. ఐకాన్ స్టార్‌పై టాలీవుడ్ ప్రశంసల వర్షం!

Pushpa (1)

Pushpa: నెక్ట్స్ లెవెల్ హీరో రేస్ లో టాప్ పొజిషన్ ఇప్పుడు బన్నీదే. అవును.. అల్లు అర్జున్ క్రేజ్ రోజురోజుకీ పీక్స్ ను టచ్ చేస్తోంది. ఈ విషయం ఇండస్ట్రీ పెద్దలే చెప్పేస్తున్నారు. యాక్టింగ్ పరంగా వేరియేషన్స్ చూపిస్తూ.. డాన్సింగ్ స్టైల్స్ తో అదరగొడుతూ.. తిరుగులేని హీరోగా తయ్యారయ్యారు బన్నీ. పుష్ప ప్రమోషన్స్ ను ఒంటి చేత్తో నడిపించడమే కాదు.. ఇప్పుడు ఇండస్ట్రీ ఫ్రెండ్లీ స్టార్ అంటే ఐకాన్ స్టారే గుర్తుకొస్తున్నారు.

Seerat Kapoor: సొగసులతో మత్తెక్కిస్తోన్న సీరత్ కపూర్

తగ్గేదే లే అంటూ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు అల్లు అర్జున్. సినిమాసినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ.. పుష్పతో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసేందుకు రెడీఅయ్యారు. ఎంత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఈ స్టార్ డంను అందరూ ఎంజాయ్ చేయలేరు. దాని వెనుక బన్నీ డెడికేషన్, క్యారెక్టర్ కోసం కష్టపడే తీరు, ఫ్రెండ్లీ నేచర్.. ఇలా అన్నీ ఒకటయ్యాయి. కాబట్టే ఐకాన్ స్టార్ అనే బిరుదు అల్లు అర్జున్ సొంతమైంది. సౌత్ లో ఎలాగూ అల్లువారబ్బాయికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ప తర్వాత నార్త్ లో కూడా బన్నీ పేరు మారుమోగే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి.

BheemlaNayak: ఎవడాడు.. దీనమ్మ దిగొచ్చాడా.. రానా బర్త్‌డే వీడియో వచ్చేసింది!

బన్నీ స్టార్ డం గురించి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటోంది. పుష్ప కోసం పడ్డ కష్టంపై మినీ చర్చలే జరుగుతున్నాయి. సింగిల్ గా తన స్టామినా ఏంటో ప్రొజెక్ట్ చేయాలనుకుంటోన్న ఐకాన్ స్టార్.. అందరితో మింగిలవడం కనిపిస్తోంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా టైం దొరికినప్పుడల్లా అందరికీ సపోర్ట్ ఇస్తున్నారు. అందుకే కొరటాల శివ లాంటి డైరెక్టర్స్ బన్నీకి ఫ్యాన్స్ గా మారుతున్నారు. భారతదేశంలోనే సినిమా కోసం అల్లు అర్జున్ లా ఇన్వాల్వ్ అయ్యే యాక్టర్ ని చూడలేదన్నారు కొరటాల. క్యారెక్టర్స్, యాక్టింగ్, సినిమా తప్ప వేరే టాపిక్ గురించి బన్నీ మాట్లాడరని స్టేజ్ పైనే చెప్పేసారు.

OTT Release: ఈ వారం వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

స్టైలిష్ స్టార్ అని పిలిపించుకుంటోన్న ఓ హీరో.. ఓ సినిమా కోసం పుల్ గా మేకోవర్ అవడం అంత తేలికైన సంగతి కాదు. సుకుమార్ పై నమ్మకముంచి పుష్ప కోసం పూర్తి ఎఫర్ట్ పెట్టి వహ్హా అనిపించారు అల్లు అర్జున్. ఇదే విషయాన్ని దర్శకధీర రాజమౌళి సైతం ప్రస్తావించారు. బన్నీ ఇండస్ట్రీకి దొరికిన గిఫ్ట్ అని కితాబిచ్చారు. ఎంతోమందిని ఐకాన్ స్టార్ ఇన్ స్పైర్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ మాటలు కేవలం రాజమౌళివో, కొరటాల శివవో కాదు.. టాలీవుడ్ మొత్తం బన్నీ గురించి ఇలానే చర్చించుకుంటోంది. డిసెంబర్ 17న రిలీజ్ కాబోతున్న సినిమా కోసం వారం ముందే టికెట్స్ మొత్తం బుక్ అయిపోతున్నాయంటే బన్నీ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Film Releases: తగ్గేదేలే.. ఈ వారం రిలీజయ్యే సినిమాలివే