OTT Release: ఈ వారం వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

ఈ వారం ధియేటర్లో సందడి మాత్రం ఓ రేంజ్ లోఉండబోతోంది. అటు హాలీవుడ్ స్పైడర్ మ్యాన్ తో పాటు.. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న పుష్ప కూడా తన మాస్ యాక్షన్ తో ఆడియన్స్ ని ..

OTT Release: ఈ వారం వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

Ott Release

OTT Release: ఈ వారం ధియేటర్లో సందడి మాత్రం ఓ రేంజ్ లోఉండబోతోంది. అటు హాలీవుడ్ స్పైడర్ మ్యాన్ తో పాటు.. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న పుష్ప కూడా తన మాస్ యాక్షన్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యడం గ్యారంటీ. మరో వైపు ఓటీటీ కూడా ధియేటర్లకు ధీటుగా ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యడానికి రెడీ అయ్యింది. మరి ఈ వారం ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న క్రేజీ కంటెంట్ ఏంటో చూద్దాం.

Oo Antava Song-Ariyana Dance: సామ్ ఐటెం సాంగ్‌కి బిగ్‌బాస్ బ్యూటీ డాన్స్!

ఈ వారం ఆడియన్స్ ముందుకు రావడానికి ఓటీటీలో క్రేజీ కంటెంట్ రెడీ గా ఉంది. వాటిలో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్న షో.. డీ కపుల్డ్. సౌత్ స్టార్ మాధవన్, సుర్వీన్ చావ్లా జంటగా హార్దిక్ మెహతా డైరెక్షన్లో తెరకెక్కిన డీకపుల్డ్ షో డిసెంబర్ 17న నెట్ ఫ్లిక్స్ యాప్ లో రిలీజ్ అవుతోంది. పెళ్లి చేసుకుని సెపరేట్ అయిపోయిన జంట మధ్య ఎలాంటి ఫన్నీఇన్సిడెంట్స్ జరిగాయో, హిలేరియస్ ఫన్ రైడ్ గా డీకపుల్డ్ ఆడియన్స్ ముందుకొస్తోంది.

Film Releases: తగ్గేదేలే.. ఈ వారం రిలీజయ్యే సినిమాలివే

ఈ వారం ఓటీటీలో రొమాంటిక్, ఫన్నీ డ్రామాలతో పాటు సస్పెన్స్ ధ్రిల్లర్ కూడా రాబోతోంది. డిసెంబర్ 17న 420 ఐపిసి అనే ఇంట్రస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా జీ 5 ఓటీటీలో రిలీజ్ అవుతోంది. వినయ్ పాఠక్, రణ్ వీర్ షోరే, గుల్ పనాగ్ లీడ్ రోల్స్ లో మనీష్ గుప్తాడైరెక్షన్లో తెరకెక్కిన 420 ఐపిసి ట్రైలర్ తోనే ఆడియన్స్ ని ఎంగేజ్ చేసింది. బ్లాంక్ చెక్ ని ఫోర్జరీ చేసి ఎకనామిక్ అఫెన్స్ లో అరెస్ట్ అయి ఎలా బయటపడతాడనే ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో ఈశుక్రవారం రిలీజ్ కాబోతోంది 420 ఐపిసి.

Naga Chaitanya-Samantha: పాత్రలు, సినిమాలపై చైతూ కామెంట్స్.. సమంత గురించేనా?

బాలీవుడ్ ధియేటర్ రిలీజ్ లులేకపోయినా.. ఓటీటీలో మాత్రం డీకపుల్డ్, 420 ఐపిసి షోస్ ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యబోతున్నాయి. అయితే హాలీవుడ్ లో కూడా 2 ఇంట్రస్టింగ్ సిరీస్ లు ఈ వారం ప్రేక్షకులముందుకు రాబోతున్నాయి. కాలిఫోర్నియా క్రిస్ మస్ కి సీక్వెల్ గా లారెన్, జోష్, అమాండా లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ సిరీస్ కాలిఫోర్నియా క్రిస్ మస్ 2.. నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 16న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఇంట్రస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్.. మరో ఇంట్రస్టింగ్ సిరీస్ ని ప్లాన్ చేసింది. ఫస్ట్ సీజన్ తోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ద విచర్ సిరీస్ ఇప్పుడు సీజన్ 2.. 8 ఎపిసోడ్లతో సూపర్ థ్రిల్ చేసేందుకు ఆడియన్స్ ముందుకొస్తోంది.