Oo Antava Song-Ariyana Dance: సామ్ ఐటెం సాంగ్‌కి బిగ్‌బాస్ బ్యూటీ డాన్స్!

శ్రీవల్లీ, ఏయ్ బిడ్డా, నా సామి, దాక్కో దాక్కో మేక ఇలా పుష్ప సినిమాలో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్టే. అయితే.. చివరిగా వచ్చినా ఓ ఊపు ఊపేసేలా వచ్చింది సమంతా పాట. ఊ అంటావా మావా..

Oo Antava Song-Ariyana Dance: సామ్ ఐటెం సాంగ్‌కి బిగ్‌బాస్ బ్యూటీ డాన్స్!

Oo Antava Song Ariyana Dance

Updated On : December 14, 2021 / 4:27 PM IST

Oo Antava Song-Ariyana Dance: శ్రీవల్లీ, ఏయ్ బిడ్డా, నా సామి, దాక్కో దాక్కో మేక ఇలా పుష్ప సినిమాలో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్టే. అయితే.. చివరిగా వచ్చినా ఓ ఊపు ఊపేసేలా వచ్చింది సమంతా పాట. ఊ అంటావా మావా లేక ఊఊ అంటావా మావా అంటూ రచ్చ రచ్చే చేసేసింది. ఇప్పుడు ఎక్కడ విన్నా పుష్ప పాట అనగానే వినిపిస్తున్న పాట ఊ అంటావా మావా. అంతగా సామాన్య ప్రేక్షకుల నుండి సెలబ్రిటీల వరకు అందరికీ ఎక్కేసింది ఈ పాట.

Film Releases: తగ్గేదేలే.. ఈ వారం రిలీజయ్యే సినిమాలివే

స్టార్ హీరోల పాటలను మించి ఈ పాట యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సౌత్ ఇండియన్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ వ్యూస్ రాబట్టిన పాటగా దుమ్మురేపుతుంది. ముఖ్యంగా సమంత స్టన్నింగ్‌ లుక్స్‌, సింగర్ హస్కీ వాయిస్, చంద్రబోస్ లిరిక్స్ కలిసి పాట ఏదో మత్తు జల్లినట్లుగా ఉండడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ పాటకి తనదైన స్టెప్పులు, చూపులతో నెటిజన్ల వీడియోలు హల్చల్ చేస్తున్నాయి.

Naga Chaitanya-Samantha: పాత్రలు, సినిమాలపై చైతూ కామెంట్స్.. సమంత గురించేనా?

తాజాగా బిగ్‌బాస్‌తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న బోల్డ్‌ బ్యూటీ అరియానా గ్లోరీ సైతం ఈ పాటకు తనదైన స్టైల్‌లో చిందులేసింది. రొమాంటిక్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు నాటీ స్టెప్పులేసి ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మరి ఈ పాట లిరికల్ వీడియోకే ఇంత అప్లాజ్ వస్తుంటే ఇక వీడియో సాంగ్ వస్తే ఎలా ఉంటుందో!

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)