Film Releases: తగ్గేదేలే.. ఈ వారం రిలీజయ్యే సినిమాలివే

లాస్ట్ ఫ్రైడే రిలీజ్ లు పెద్దగా బాక్సాఫీస్ దగ్గర సత్తాచూపించలేకపోయాయి. అయితే బాలయ్య అఖండ సక్సెస్ ని, కలెక్షన్లని కంటిన్యూ చెయ్యడానికి ఈవారం ధియేటర్లోకొస్తున్నాయి క్రేజీ సినిమాలు.

Film Releases: తగ్గేదేలే.. ఈ వారం రిలీజయ్యే సినిమాలివే

Film Releases

Film Releases: లాస్ట్ ఫ్రైడే రిలీజ్ లు పెద్దగా బాక్సాఫీస్ దగ్గర సత్తాచూపించలేకపోయాయి. అయితే బాలయ్య అఖండ సక్సెస్ ని, కలెక్షన్లని కంటిన్యూ చెయ్యడానికి ఈవారం ధియేటర్లోకొస్తున్నాయి క్రేజీ సినిమాలు. అఖండ రిలీజ్ అయ్యి 10 రోజులైనా.. ఆ కలెక్షన్ల దాడి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. బాలయ్య ఇచ్చిన బూస్టప్ తో మిగిలిన సినిమాలు కూడా రిలీజ్ కురెడీ అవుతున్నాయి. అయితే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాలు బాలయ్య హవాని బాక్సాఫీస్ దగ్గర ఆపలేకపోయాయి. రిలీజ్ అవ్వకముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇండియాలో రికార్డ్ క్రియేట్ చేసిన స్పైడర్ మ్యాన్ ఈవారం ధియేటర్ల మీద దాడిచెయ్యబోతున్నాడు.

Naga Chaitanya-Samantha: పాత్రలు, సినిమాలపై చైతూ కామెంట్స్.. సమంత గురించేనా?

హాలీవుడ్ లోనే కాదు.. వరల్డ్ వైడ్ గా విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ సంపాదించకున్న స్పైడర్ మ్యాన్.. ఈసారి మరిన్ని యాడెడ్ ఎట్రాక్షన్స్ తో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ నో వే హోమ్ అంటూ ఆడియన్స్ ముందకు రాబోతున్నాడు. ముందు డిసెంబర్ 17న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన టీమ్.. ఇండియాలో ఆల్రెడీ ఫ్రైడే రిలీజ్ లతో బిజీగా ఉండడంతో.. ఒక్కరోజు ముందే డిసెంబర్ 16నే ధియేటర్లోకి వస్తోంది. టామ్ హాలెండ్ హీరోగా, జాన్ వాట్స్ డైరెక్టర్ గా మరోసారి ధియేటర్లో మ్యాజిక్ చెయ్యబోతున్నాడు స్పైడర్ మ్యాన్.

Pushpa: బన్నీపై దేవిశ్రీ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. కల సాకారమయ్యేనా?

స్పైడర్ మ్యాన్ హవా గురువారానికి మించి కంటిన్యూ అవ్వదు. ఎందుకంటే.. డిసెంబర్ 17వ తేదీన ధియేటర్లమీద కలెక్షన్ల దాడికి రెడీ అవుతున్నాడు పుష్ప. బన్నీ-సుకుమార్ కాంబినేషన్లో మూడోసారి తెరకెక్కుతున్న పుష్ప మూవీ ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకువస్తోంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ క్రేజీప్రాజెక్ట్ మీద.. ఇప్పటికే ఇటు సౌత్ తో పాటు నార్త్ లో కూడా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పుష్ప రాజ్ గా సినిమా మీద హైప్స్ పెంచేసిన బన్నీతో పాటు.. ఆడియో కూడా ఆడియన్స్ లో మోత మోగిపోతోంది. ఈ మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ తోనే బరిలోకి దిగుతున్న పుష్ప.. కొత్త రికార్డులు క్రియేట్ చెయ్యకుండా ఉంటుందా అంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు అటు ఆడియన్స్ తో పాటు టీమ్.

Mahesh Babu : మహేష్‌బాబుకు మోకాలి సర్జరీ

పుష్ప డిసెంబర్ 17న రిలీజ్ అవుతుంటే.. ఆనెక్ట్స్ డే నే 18 తేదీన రిలీజ్ అవుతున్న సినిమా బ్యాక్ డోర్. పూర్ణ, తేజ హీరో హీరోయిన్లుగా బాలాజీ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా బ్యాక్ డోర్ వరల్డ్ వైడ్ గా శుక్రవారం రిలీజ్ అవుతోంది. ప్రజెంట్ యూత్ ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఎంతఈజీగా తప్పుదారి పడుతున్నారో అనే యాంగిల్ లో తెరకెక్కిన బ్యాక్ డోర్ సినిమా ఈ నెల 18న ధియేటర్లోకి వస్తోంది.