Pushpa: బన్నీపై దేవిశ్రీ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. కల సాకారమయ్యేనా?

సినిమా విడుదలకు సమయం దగ్గరే పద్దెకొద్దీ పుష్ప మేనియా ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. పాటలు, ట్రైలర్ సినిమా మీద ఎక్కడలేని అంచనాలను పెంచేయగా ప్రమోషన్ కార్యక్రమాలలో మేకర్స్ చేసిన వ్యాఖ్యలు

Pushpa: బన్నీపై దేవిశ్రీ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. కల సాకారమయ్యేనా?

Pushpa

Pushpa: సినిమా విడుదలకు సమయం దగ్గరే పద్దెకొద్దీ పుష్ప మేనియా ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. పాటలు, ట్రైలర్ సినిమా మీద ఎక్కడలేని అంచనాలను పెంచేయగా ప్రమోషన్ కార్యక్రమాలలో మేకర్స్ చేసిన వ్యాఖ్యలు బన్నీ అభిమానులను మరింత కాన్ఫిడెంట్ గా మార్చేశాయి. పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారడం ఖాయమని ఫిక్స్ అయిన ఫ్యాన్స్ సినిమాలో బన్నీ పాత్ర ఔట్ ఫుట్ ఎలా ఉంటుందా అని లెక్కలేసుకుంటున్నారు.

Rana Daggubati : ఛలో పరిగెత్తు.. ఛలో పరిగెత్తు.. విప్లవ గీతం వినిపిస్తున్న రానా

దర్శకుడు రాజమౌళి దగ్గర నుండి సినీ ప్రముఖులు ఎందరో ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అనిపించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా కోసం తనను ఎంతగా మార్చుకున్నాడో ట్రైలర్ లో చూస్తేనే అర్ధమైపోతుంది. లుక్ మాత్రమే కాదు మేనరిజం, డైలాగ్ డెలివరీ ఇలా అన్నీ సినిమాకు తగ్గట్లే మలచుకున్నాడు. అందుకే సెలబ్రిటీలు సైతం ఈ సినిమాలో బన్నీ పాత్రని స్పెషల్ గా చూస్తున్నారు. ఈ కాన్ఫిడెంట్ తోనే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Jahnvi Kapoor : జాన్వీ కపూర్ చేతికి ఏమైంది? ఆందోళనలో అభిమానులు..

ప్రస్తుతం పుష్ప యూనిట్ తమిళనాడులో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో బన్నీ నటనకి నేషనల్ అవార్డు తప్పక వస్తుందని కాన్ఫిడెన్ గా చెప్పాడు. ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ మేకోవర్, యాక్టింగ్ పొటెన్షియల్ ఎంతగానో పెంచుకున్నాడని.. అందుకే అంత నమ్మకంగా ఉన్నానని చెప్పాడు. నిజానికి బన్నీకి ఇప్పటి వరకు ఈ అవార్డు దక్కలేదు. ఒకవిధంగా ప్రతి నటుడికి అది కల. మరి అలాంటి కల బన్నీకి ఈ సినిమా నిజమవుతుందో లేదో చూడాలి.

Meera Mithun : షూటింగ్ లోంచి పారిపోయిన హీరోయిన్.. కథ మార్చేసిన డైరెక్టర్