Naga Chaitanya-Samantha: పాత్రలు, సినిమాలపై చైతూ కామెంట్స్.. సమంత గురించేనా?

టాలీవుడ్ యంగ్ స్టార్ కపుల్స్ లో క్యూట్ కపుల్ గా పేరున్న సమంతా.. నాగ చైతన్యల వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసి రెండు నెలలు గడిచిపోయినా ఇప్పటికీ అభిమానులు ఈ నిజాన్ని ఒప్పుకొనేందుకు..

Naga Chaitanya-Samantha: పాత్రలు, సినిమాలపై చైతూ కామెంట్స్.. సమంత గురించేనా?

Naga Chaitanya Samantha

Naga Chaitanya-Samantha: టాలీవుడ్ యంగ్ స్టార్ కపుల్స్ లో క్యూట్ కపుల్ గా పేరున్న సమంతా.. నాగ చైతన్యల వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసి రెండు నెలలు గడిచిపోయినా ఇప్పటికీ అభిమానులు ఈ నిజాన్ని ఒప్పుకొనేందుకు బాధగానే ఉన్నారు. వాళ్లిద్దరూ ఈ డిప్రెషన్ నుండి బయటపడి మళ్ళీ ఎవరికి వారు వారి కెరీర్ మీద ఫోకస్ చేసినా సోషల్ మీడియాలో అడపాదడపా ఈ జంట గురించి, విడాకుల గురించి రకరకాల కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా విడాకులకు అసలు కారణం ఇదే అంటూ చాలానే వినిపిస్తుంటాయి.

Pushpa: బన్నీపై దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. కల సాకారమయ్యేనా?

అలాంటిదే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ జంట విడికిపోక ముందే చైతన్య ఓ ఇంటర్వ్యూలో తాను ఎలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదో చెప్పాడు. ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడరు అనే ప్రశ్నకు నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘అన్ని రకాల పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. కానీ నేను పోషించే పాత్ర, సినిమా మా కుటుంబంపై ఎఫెక్ట్‌ చూపించకూడదు. మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో చేయను’ అంటూ చై పేర్కొన్నాడు.

Mahesh Babu : మహేష్‌బాబుకు మోకాలి సర్జరీ

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సమంతను ఉద్దేశించే చై పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆ మధ్య ఫ్యామిలీ మెన్‌-2 వెబ్‌ సిరీస్‌లో సమంత బోల్డ్‌ యాక్టింగ్‌ వీరి విడాకులకు ప్రధాన కారణమనే రూమర్స్‌ వినిపించాయి. ఈ వెబ్ సిరీస్ లో సామ్ నటన తర్వాతే ఈ జంట మధ్య వివాదాలు మొదలై చివరికి విడాకులను దారి తీసిందని చెప్పుకున్నారు. ఇప్పుడు చై వ్యాఖ్యలతో ఆ వ్యాఖ్యలకు మరింత బలం చేకూరిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.