Acharya : మెగాస్టార్ పోస్టర్ లీక్..!

ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చెయ్యాలనుకున్నారు మేకర్స్..

Acharya : మెగాస్టార్ పోస్టర్ లీక్..!

Acharya

Acharya: వరుస లీకేజ్‌లు టాలీవుడ్ మేకర్స్‌ని కలవరపెడుతున్నాయి. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిలిం ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌కి సంబంధించి ఓ సాంగ్, కొంత సినిమా లీక్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ బర్త్‌డే టీజర్ విడుదల ముందు రోజు అర్థరాత్రే సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.

Mythri Movie Makers : లీకేజులపై పోలీసులను ఆశ్రయించిన మైత్రీ మూవీస్..

ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీ పోస్టర్ లీక్ అవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అలజడి రేగింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరు – రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘ఆచార్య’.. ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చెయ్యాలనుకున్నారు మేకర్స్.

Acharya : ‘ఆచార్య’లో శ్రీశ్రీ పలుకులు.. టార్గెట్ నేషనల్ అవార్డ్..?

కట్ చేస్తే ఆ పోస్టర్ సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్టర్ నిర్మాణ సంస్థకు సంబంధించిన అఫీషియల్ అకౌంట్స్‌లో కనిపించ లేదు. దీంతో ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని అంటున్నారు. చిరు పుట్టినరోజు కానుకగా.. మరో రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న ‘ఆచార్య’ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశముందని సమాచారం.

Chiranjeevi : ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ విషయమై.. మెగాస్టార్ ఆధ్వ‌ర్యంలో మీటింగ్..