Acharya : ‘ఆచార్య’లో శ్రీశ్రీ పలుకులు.. టార్గెట్ నేషనల్ అవార్డ్..?

చిరు యాక్ట్ చేసిన ‘రుద్రవీణ’, ‘ఠాగూర్’ సినిమాల్లో మహాకవి శ్రీ శ్రీ రాసిన ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’ అనే లైన్స్ వాడుకున్నారు..

Acharya : ‘ఆచార్య’లో శ్రీశ్రీ పలుకులు.. టార్గెట్ నేషనల్ అవార్డ్..?

Mahakavi Sri Sri Words In Acharya Movie Song

Updated On : June 23, 2021 / 1:19 PM IST

Acharya: ‘ఖైదీ నెం:150’, ‘సైరా’ తర్వాత సొంత ప్రొడక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘ఆచార్య’.. శ్రీమతి సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘ఆచార్య’ లో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్, చిరుకి, పూజా హెగ్డే, చరణ్‌కి జంటగా నటిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, ‘లాహే లాహే’ సాంగ్ ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి.

Acharya Update : ‘ఆచార్య’ అదిరిపోయే అప్‌డేట్.. మెగా మూమెంట్ మామూలుగా లేదుగా!

ప్రస్తుతం ‘ఆచార్య’ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఇప్పటివరకు చిరు యాక్ట్ చేసిన ‘రుద్రవీణ’, ‘ఠాగూర్’ సినిమాల్లో మహాకవి శ్రీ శ్రీ రాసిన ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’ అనే లైన్స్ వాడుకున్నారు. ‘రుద్రవీణ’ చిరు కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలవడంతో పాటు నేషనల్ అవార్డ్ అందుకుంది.

‘ఆచార్య’ లో ఎమోషనల్‌గా సాగే ఓ పాటలో మరోసారి శ్రీ శ్రీ రాసిన పంక్తులు వినిపించబోతున్నాయని అంటున్నారు. ‘రుద్రవీణ’ లానే ‘ఆచార్య’ కు జాతీయ అవార్డ్ వస్తుందేమో అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Pooja Hegde : ‘సిద్ధు’డి ప్రేయసి నీలాంబరిగా పూజా హెగ్డే.. ‘ఆచార్య’ ఉగాది శుభాకాంక్షలు!..