Pooja Hegde : ‘సిద్ధు’డి ప్రేయసి నీలాంబరిగా పూజా హెగ్డే.. ‘ఆచార్య’ ఉగాది శుభాకాంక్షలు!..

‘ఆయుధమైనా.. అమ్మాయి అయినా.. ‘సిద్ధు’డి చేతిలో ఒదిగిపోతుంది.. ‘ఆచార్య’ ఉగాది శుభాకాంక్షలు!’.. అంటూ తెలుగు ప్రజలందరికీ శ్రీ విప్ల నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘ఆచార్య’ సినిమాలోని కొత్త పోస్టర్ షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి..

Pooja Hegde : ‘సిద్ధు’డి ప్రేయసి నీలాంబరిగా పూజా హెగ్డే.. ‘ఆచార్య’ ఉగాది శుభాకాంక్షలు!..

Pooja Hegde

Pooja Hegde: ‘ఆయుధమైనా.. అమ్మాయి అయినా.. ‘సిద్ధు’డి చేతిలో ఒదిగిపోతుంది.. ‘ఆచార్య’ ఉగాది శుభాకాంక్షలు!’.. అంటూ తెలుగు ప్రజలందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘ఆచార్య’ సినిమాలోని కొత్త పోస్టర్ షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి..

చిరు – కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరుకి జోడీగా కాజల్ కనిపించనుండగా, చెర్రీతో పూజా హెగ్డే జతకడుతోంది.
ఇటీవల చిరు, చరణ్ కలిసున్న పోస్టర్ రిలీజ్ చెయ్యగా మంచి స్పందన వచ్చింది. టీజర్, ‘లాహే లాహే’ సాంగ్ కూడా ఆకట్టుకున్నాయి.

Ram charan : ‘ఆచార్య’ తో ‘సిద్ధ’.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..

ఉగాది పండుగ నాడు ‘సిద్ధ’ తన ప్రేయసి నీలాంబరితో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ముందుగా మే 13న ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్న ‘ఆచార్య’ విడుదల తేదీ మారే అవకాశం కనిపిస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు.

Acharya

Acharya