NTR Lineup : ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాలు ఇవే.. డ్రాగన్ తర్వాత లైనప్ ఇదే..
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. (NTR Lineup)
NTR Lineup
NTR Lineup : ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ చూసిన ఎన్టీఆర్ తనని తాను మార్చుకొని టెంపర్ సినిమాతో భారీ హిట్ కొట్టి అక్కడ్నుంచి అన్ని సినిమాలతో వరుస హిట్స్ సాధిస్తున్నాడు. RRR సినిమాతో నేషన్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన దేవర సినిమా పర్వాలేదనిపించింది. ఇక బాలీవుడ్ కి వెళ్లి చేసిన వార్ 2 అయితే పూర్తిగా నిరాశపరిచింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు.
2022లో ఈ సినిమాని ప్రకటించారు. 2024లో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఇప్పుడు 2026 మే 20 నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజున ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఇక ఈ డ్రాగన్ సినిమా 2027 జూన్ 11న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read : Prasanth Neel : ప్రశాంత్ నీల్ మళ్ళీ అదే ఫార్మేట్.. ‘డ్రాగన్’ గ్లింప్స్ కూడా అంతే..
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎవరితో ఎలాంటి సినిమాలు చేస్తాడు అని ఫ్యాన్స్ లో చర్చ ఉంది. అయితే ఇప్పటికే అధికారికంగా దేవర 2 సినిమా ప్రకటించారు. అధికారికంగా ప్రకటించినా ఈ సినిమా ఉంటుందో లేదో అది మొదలయ్యే వరకు సందేహమే.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా అన్నారు. సుబ్రమణ్య స్వామి కథతో ఈ సినిమా ఉండబోతుందని, మైథలాజి సినిమా అని నిర్మాత నాగవంశీ తెలిపారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించబోతున్నారని సమాచారం. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఒక సినిమా ఉందని నిర్మాత నాగవంశీ తెలిపారు. ఇది ఎన్టీఆర్ తో అనే టాలీవుడ్ టాక్. బాలీవుడ్ లో వార్ 2 తర్వాత YRF స్పై సినిమాటిక్ యూనివర్స్ లో ఎన్టీఆర్ సోలో హీరోగా సినిమా ఉంటుంది అన్నారు. కానీ వార్ 2 ఫలితం చూసిన తర్వాత ఆ సినిమా ఉంటుందో లేదో తెలీదు.
Also See : Jr NTR Childhood Photos : జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే.. చిన్నప్పటి స్పెషల్ ఫోటోలు చూశారా..?
ఈ నాలుగు సినిమాలు అయితే ఎన్టీఆర్ లైనప్ లో ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ఎన్టీఆర్ గతంలో వెట్రిమారన్ దర్శకత్వంలో సినిమా చేయాలని అడిగారు. మరి అది కూడా లైన్ లోకి వస్తుందేమో చూడాలి. అయితే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల గురించి పూర్తి క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటనలు రావాల్సిందే.
