Prasanth Neel : ప్రశాంత్ నీల్ మళ్ళీ అదే ఫార్మేట్.. ‘డ్రాగన్’ గ్లింప్స్ కూడా అంతే..
ప్రశాంత్ నీల్ కి కూడా ఓ స్టైల్ ఉంది. (Prasanth Neel)
Prasanth Neel
Prasanth Neel : ప్రతి డైరెక్టర్ కి ఒక స్టైల్ ఉంటుంది. తన ప్రతి సినిమాలోనూ అది కనిపిస్తుంది. అలా ప్రశాంత్ నీల్ కి కూడా ఓ స్టైల్ ఉంది. అవే బ్లాక్ ఫ్రేమ్స్, యాక్షన్ సీక్వెన్స్ లో స్క్రీన్ బ్లాక్ అయిపోవడం, ఎలివేషన్స్. తన సినిమా అంతా బ్లాక్ లోనే ఉంటుంది. అందరూ బ్లాక్ బట్టలే వేసుకుంటారు. కెమెరా ఫ్రేమ్స్ కూడా బ్లాక్ గా, డల్ గా కనిపిస్తాయి. తన మొదటి సినిమా ఉగ్రం నుంచి అంతే.
KGF రెండు పార్టులకు ఇది బాగానే వర్క్ అయింది. సలార్ కి కూడా వర్క్ అయింది. అయితే సినిమాలు హిట్ అయినా దీనిపై కొన్ని నెగిటివ్ అంశాలు కూడా చెప్తున్నారు ప్రేక్షకులు. ఆర్టిస్టులు బ్లాక్ డ్రెస్ లు వేసి, ఫ్రేమ్ కూడా బ్లాక్ పెట్టడంతో చాలా సీన్స్ క్లియర్ గా కనిపించట్లేదు, కొన్ని సీన్స్ లో హైలెట్ అవ్వాల్సిన అంశాలు కూడా ప్రేక్షకులకు సరిగ్గా కనిపించట్లేదు అనే ఓ వాదన ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్ కూడా అంతే. ఎన్టీఆర్ ని హైలెట్ చేసే సీన్ లో అసలు ఎన్టీఆర్ క్లియర్ గా కనపడడు. కానీ ఫ్యాన్స్ అదే ఎలివేషన్ అనుకునేలా డిజైన్ చేయడం ప్రశాంత్ నీల్ గొప్పదనం.
Also See : Jr NTR Childhood Photos : జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే.. చిన్నప్పటి స్పెషల్ ఫోటోలు చూశారా..?
ఇక ఎవరో ఒకరితో హీరో గురించో, సినిమా కథ గురించే ఎలివేషన్ ఇస్తూ చెప్పించడం. KGF నుంచి అన్ని సినిమాల్లోనూ ఇది కొనసాగుతుంది. ఇప్పుడు డ్రాగన్ గ్లింప్స్ లో కూడా రుక్మిణి వసంత్ తో ఎలివేషన్స్ ఇప్పించాడు.
అలాగే ప్రశాంత్ నీల్ KGF నుంచి ఒక సీరియస్ యాక్షన్ సీన్ నడిచేటప్పుడు సడెన్ గా స్క్రీన్ బ్లాక్ అయి కేవలం ఆడియో మాత్రమే ఉండేలా కొన్ని సీన్స్ డిజైన్ చేసుకుంటున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ కి ఇవి బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు డ్రాగన్ గ్లింప్స్ లో కూడా హీరో యాక్షన్ సీక్వెన్స్, ఎలివేషన్స్ లో సడెన్ గా స్క్రీన్ బ్లాక్ చేసేయడం గమనార్హం. సినిమాలో ఓకే కానీ గ్లింప్స్ కి కూడానా అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.
Also Read : Dragon Glimpse : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ సినిమా కథ ఇదేనా..? డ్రాగన్ గ్లింప్స్ రివ్యూ..
ఇలా ప్రశాంత్ నీల్ తన మార్క్ ని డ్రాగన్ సినిమాలో కూడా చూపించబోతున్నారు అని తెలుస్తుంది. ఇదే మేకింగ్ కాపీ కొట్టి కొన్ని సినిమాల్లో వాడారు కానీ అవి వర్కౌట్ అవ్వలేదు. మరి ఇప్పుడు ప్రశాంత్ నీల్ తనకి అచ్చొచ్చిన యాక్షన్ మేకింగ్, బ్లాక్ విజువల్స్ డ్రాగన్ సినిమాని ఏ రేంజ్ లో నిలబెడతాయో చూడాలి.
