Medical Shops Bandh : మెడికల్ షాపుల బంద్.. అసలు కారణం ఇదే.. 20-50 డిస్కౌంట్ పై..
Medical Shops Bandh : నేడు దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మెడికల్ షాపులు మూతపడనున్నాయి. దీనిక కారణం ఏంటంటే..
Nationwide Medical Shops Bandh on May 20 Against Due E Pharmacy Rules and heavy discounts in online pharmacy
Medical Shops Bandh : దేశవ్యాప్తంగా మే 20 బుధవారం నాడు మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 12 లక్షల మెడికల్ షాప్‌ల నిర్వాహకులు వారి హక్కుల కోసం నేడు బంద్ కు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) ఈ బంద్ కి పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా లక్షలాది మెడికల్ షాపులు బంద్‌కు మద్దతు ప్రకటించాయి.
మెడికల్ షాపుల బంద్ కు ముఖ్య కారణం ఆన్లైన్ మెడిసిన్ అమ్మకాలు (E-Pharmacies), భారీ డిస్కౌంట్లు, నకిలీ ప్రిస్క్రిప్షన్లు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని మెడికల్ షాపు యజమానులు డిమాండ్ చేస్తున్నారు.
ఆన్లైన్ ఫార్మసీలు సరైన ప్రిస్క్రిప్షన్ వెరిఫికేషన్ లేకుండా మందులు అమ్ముతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. AI ఆధారిత ఫేక్ ప్రిస్క్రిప్షన్లు, యాంటీబయాటిక్స్ దుర్వినియోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది. అలానే కార్పొరేట్ ఈ-ఫార్మసీలు 20 శాతం నుంచి 50 శాతం వరకు భారీ డిస్కౌంట్లు ఇస్తూ చిన్న మెడికల్ షాపులను దెబ్బతీస్తున్నాయని చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి.
*కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్‌లో ఇక E30 పెట్రోల్‌కు మార్గం సుగమం..
కోవిడ్ సమయంలో ఇచ్చిన హోమ్ డెలివరీ సడలింపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని మెడికల్ షాపుల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. GSR 817(E), GSR 220(E) వంటి నోటిఫికేషన్లు వెనక్కి తీసుకోవాలని AIOCD డిమాండ్ చేస్తోంది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న మెడికల్ షాపుల జీవనోపాధి ప్రమాదంలో పడుతోందని వాదిస్తోంది.
ఇదిలా ఉంటే నేడు మెడికల్ షాప్ ల బంద్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తెలంగాణ సర్కార్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖాన్లు సహా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో బుధవారం 24 గంటల పాటు ఫార్మసీలు ఓపెన్ చేసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ షాపుల బంద్ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.
