Bigg Boss 5 : యాని మాస్టర్‌కి సపోర్ట్‌గా మోనాల్.. ఆమె గురించి నాకు తెలుసు

ఎలాగైనా ఈ సారి యాని మాస్టర్ వెళ్లిపోవాలని కొంతమంది యానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ చూసి మోనాల్ గజ్జర్ యాని మాస్టర్ కి సపోర్ట్ గా ఇంస్టాగ్రామ్ స్టోరీలో వీడియో

Bigg Boss 5 : యాని మాస్టర్‌కి సపోర్ట్‌గా మోనాల్.. ఆమె గురించి నాకు తెలుసు

Ani Monal

Bigg Boss 5 :  బిగ్ బాస్ లో ఒక్కో వారం ఒక్కో సెలబ్రిటీ వెళ్లిపోతున్నారు. ఇక ఉన్న వాళ్లలో నెక్స్ట్ ఎవరు వెళ్లాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం బయట ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు . సోషల్ మీడియాలో బిగ్ బాస్ ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఓ పక్క హౌస్ లో ఉన్న సెలబ్రిటీల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పేజెస్ పెట్టి తెగ హడావిడి చేస్తూ వాళ్ళ ఫేవరేట్ కంటెస్టెంట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. మరో పక్క కంటెస్టెంట్స్ కి సపోర్ట్ గా వేరే సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Raghava Lawrence : రియల్ సినతల్లి ఆశీర్వాదం తీసుకున్న లారెన్స్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు

తాజాగా యాని మాస్టర్ కోసం మోనాల్ గజ్జర్ రంగంలోకి దిగింది. గత కొద్ది రోజులుగా యాని మాస్టర్ హౌస్ లో మంచి హడావిడి సృష్టిస్తుంది. మానస్, కాజల్ ఫ్యాన్స్ యాని మాస్టర్ ని పంపించేయాలి అనే ప్లాన్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ వారం మరో సారి యాని మాస్టర్ నామినేట్ అయింది. దీంతో ఎలాగైనా ఈ సారి యాని మాస్టర్ వెళ్లిపోవాలని కొంతమంది యానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ చూసి మోనాల్ గజ్జర్ యాని మాస్టర్ కి సపోర్ట్ గా ఇంస్టాగ్రామ్ స్టోరీలో వీడియో పోస్ట్ చేసింది.

Rajinikanth : ‘అన్నాత్తే’ స్టోరీ విని ఏడ్చేశాను : రజినీకాంత్

యాని మాస్టర్, మోనాల్ గజ్జర్ లు కలిసి గతంలో ఓ డ్యాన్స్ షోకి జడ్జెస్ గా వ్యవహరించారు. ఆ సమయంలో వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ స్నేహంతోనే ఇప్పుడు మోనాల్ యానికి సపోర్ట్ గా వీడియో పోస్ట్ చేసింది. ఇందులో మోనాల్ మాట్లాడాడుతూ.. కొన్ని అన‌ధికారిక పోల్స్ అప్పుడే యానీ మాస్ట‌ర్‌కు బైబై చెప్పేస్తున్నాయి. ఆమెకు ఓటేయమ‌ని నా అభిమానులని వేడుకుంటున్నాను. యానీ నాకు వ్య‌క్తిగ‌తంగా తెలుసు. ఆమె ఎంతో స్ట్రాంగ్‌, జీవితంలో ఎవ‌రి స‌పోర్ట్ లేకుండా ఒంట‌రిగా పైకి వ‌చ్చింది. సొంతిల్లు కొనుగోలు చేయాల‌న్న ఆశ‌తో ఆమె బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లింది. ఆమె క‌ల‌ నెర‌వాల‌ని కోరుకుందాం. ద‌య‌చేసి ఆమెకు ఓటేయండి అని తన అభిమానుల‌ను రిక్వెస్ట్ చేసింది మోనాల్‌.

Puneeth Rajkumar : పునీత్ బదులు నేను చనిపోయినా బాగుండేది .. శరత్ కుమార్ ఎమోషనల్

మోనాల్ కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. గత సీజన్ బిగ్ బాస్ తో మోనాల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఛాన్సులు కూడా బాగా సంపాదించింది. మరి ఈ రిక్వెస్ట్ తో మోనాల్ అభిమానులు యాని మాస్టర్ ని ఎంత వరకు సేఫ్ చేస్తారో చూడాలి.