Raghava Lawrence : రియల్ సినతల్లి ఆశీర్వాదం తీసుకున్న లారెన్స్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు

తాజాగా రాఘవ లారెన్స్ పర్వతమ్మని కలిసి ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. నిన్న లారెన్స్ పార్వతమ్మను కలిసి ఆయన చెప్పినట్టుగానే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేశారు.

Raghava Lawrence : రియల్ సినతల్లి ఆశీర్వాదం తీసుకున్న లారెన్స్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు

Lawrence

Updated On : November 17, 2021 / 8:31 AM IST

Raghava Lawrence :  సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ కథలోని రియల్ పాత్రలు ఈ సినిమా వల్ల బయట ప్రపంచానికి తెలిశారు. వాళ్ళ కష్టాలు కూడా తెలిశాయి. ఇందులో సినతల్లి పాత్ర అందర్నీ కంటతడి పెట్టించింది. దీంతో రియల్ సినతల్లి పార్వతమ్మ గురించి అందరికి తెలిసింది. రియల్ సినతల్లి ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉన్నారు. ఒక పూరి గుడిసెలో నివసిస్తున్నారు. ఈ విషయం తెలిసి కొంతమంది ఆమెకి సహాయం చేయాడానికి వస్తున్నారు.

Rajinikanth : ‘అన్నాత్తే’ స్టోరీ విని ఏడ్చేశాను : రజినీకాంత్

ఇటీవల లారెన్స్ పార్వతమ్మకి ఇల్లు కట్టిస్తా అని ప్రకటించాడు. ఆ తర్వాత హీరో సూర్య కూడా పార్వతమ్మ పేరు మీద 10 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు. దాని మీద నెల నెలా వచ్చే అమౌంట్ పర్వతమ్మకి అందేలా చేశారు. తాజాగా రాఘవ లారెన్స్ పర్వతమ్మని కలిసి ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. నిన్న లారెన్స్ పార్వతమ్మను కలిసి ఆయన చెప్పినట్టుగానే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేశారు.

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారం

ఈ సందర్భంగా ఆయన పార్వతమ్మతో మాట్లాడుతూ.. తన బామ్మలాగే ఉన్నావని, ఆమె ఇప్పుడు లేదు కనుక తన రూపాన్ని మీలో చూసుకుంటాను అన్నాడు. ఆ తర్వాత చెక్ అందచేశారు. వెళ్లేముందు పార్వతమ్మ కాళ్లకు నమస్కారం చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఇక రాఘవ లారెన్స్‌ పార్వతమ్మని కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.