Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారం

క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం పునీత్ రాజ్‌కుమార్‌ కి ఆయన మ‌ర‌ణానంత‌రం 'క‌ర్ణాట‌క ర‌త్న' అవార్డుతో స‌త్క‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు సీఎం బ‌స్వ‌రాజు బొమ్మై వెల్ల‌డించారు. క‌న్న‌డ సినీ

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారం

Puneeth

Updated On : November 17, 2021 / 7:08 AM IST

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ హ‌ఠాన్మ‌ర‌ణం ఆయన అభిమానులని, కన్నడ ప్రజలని శోక సంద్రంలో ముంచేసింది. ఆయన మరణించి రెండు వారాల పైగా అవుతున్న ఇప్పటికి ఆయన సమాధిని రోజూ వేల మంది దర్శిస్తున్నారు. పునీత్ మరణాంతరం ఆయనకి చెందిన కార్యక్రమాలన్నింటిలోను కర్ణాటక ప్రభుత్వం దగ్గరుండి జరిపించింది. తాజాగా క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కు అరుదైన గౌరవాన్ని ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం.

Ram Asur : సినిమా ప్రమోషన్ కోసం రోడ్లపై పోస్టర్స్ అంటిస్తున్న హీరో హీరోయిన్స్

క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం పునీత్ రాజ్‌కుమార్‌ కి ఆయన మ‌ర‌ణానంత‌రం ‘క‌ర్ణాట‌క ర‌త్న’ అవార్డుతో స‌త్క‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు సీఎం బ‌స్వ‌రాజు బొమ్మై వెల్ల‌డించారు. క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌కి, ప్రజలకి పునీత్ రాజ్‌కుమార్ అందించిన సేవ‌ల‌ను గుర్తు చేసుకుంటూ క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం అత్యున్న‌త పుర‌స్కారం ‘క‌ర్ణాట‌క ర‌త్న’ అవార్డును ఆయన కుటుంబ స‌భ్యుల‌కు అందచేయనున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం అధికారికంగా అయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనిపై కన్నడిగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.