Puneeth Rajkumar : పునీత్ బదులు నేను చనిపోయినా బాగుండేది .. శరత్ కుమార్ ఎమోషనల్
ఈ సభలో తమిళ సీనియర్ నటుడు, మాజీ హీరో శరత్ కుమార్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. నాలుగేళ్ల కిందట వచ్చిన 'రాజకుమార' సినిమాలో పునీత్ రాజ్ కుమార్ తండ్రిగా నటించాను. ఆ సినిమా కన్నడ

Sharath
Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి దాదాపు 20 రోజులు అవుతున్నా ఆయన అభిమానులు, కన్నడ ప్రజలు ఇంకా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రోజూ ఏదో ఒక చోట కర్ణాటకలో పునీత్ సంస్మరణ సభలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటక సినీ పరిశ్రమ, కర్ణాటక ప్రభుత్వం తరపున పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభ బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది సినీ, రాజకీయ నాయకులు విచ్చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు.
Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారం
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు పునీత్ కి నివాళులు అర్పించారు. అనంతరం పునీత్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సభలో తమిళ సీనియర్ నటుడు, మాజీ హీరో శరత్ కుమార్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. నాలుగేళ్ల కిందట వచ్చిన ‘రాజకుమార’ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ తండ్రిగా నటించాను. ఆ సినిమా కన్నడ ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. మళ్లీ ఇప్పుడు పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’లో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాను అంటూ పవర్ స్టార్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని.. ఆయన బదులు నేను చనిపోయినా బాగుండేది అంటూ స్టేజి పైనే ఏడ్చేశారు.
Ram Asur : సినిమా ప్రమోషన్ కోసం రోడ్లపై పోస్టర్స్ అంటిస్తున్న హీరో హీరోయిన్స్
ఇదే వేదికపై ‘రాజకుమార’ 100 రోజుల వేడుక జరిగిందని, పునీత్ శ్రద్ధాంజలి ఇక్కడే జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు అని కన్నీరు పెట్టుకున్నారు శరత్ కుమార్. తన శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడు అనుకున్నా కానీ ఆయన శ్రద్ధాంజలి నేను రావాల్సి వచ్చింది. దేవుడు పునీత్ రాజ్ కుమార్ బదులు నన్ను తీసుకెళ్లినా బాగుండు అంటూ స్టేజిపై ఏడ్చేశాడు శరత్ కుమార్. ఆ సభకి విచ్చేసిన వాళ్లంతా శరత్ కుమార్ మాటలతో కన్నీళ్లు పెట్టుకున్నారు.