Multiplex : మల్టిప్లెక్స్ లు కడుతున్న హీరోలు..

మన స్టార్ హీరోలంతా థియేటర్ బిజినెస్ లోకి దిగుతున్నారు. మల్టిప్లెక్స్ లు నిర్మిస్తున్నారు. ఇలా మల్టిప్లెక్స్ పెడదాం అనుకున్న మన హీరోలకి ఏషియన్ సినిమాస్ సంస్థ వాళ్ళతో

Multiplex : మల్టిప్లెక్స్ లు కడుతున్న హీరోలు..

Multiplex

Multiplex :  సినిమా పరిశ్రమలో సక్సెస్ వచ్చాక చాలా మంది బిజినెస్ లు స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్క సెలబ్రిటీ ఒక్కో రంగంలో పెట్టుబడులు పెడతారు. అయితే ఇటీవల మన స్టార్ హీరోలంతా థియేటర్ బిజినెస్ లోకి దిగుతున్నారు. మల్టిప్లెక్స్ లు నిర్మిస్తున్నారు. ఇలా మల్టిప్లెక్స్ పెడదాం అనుకున్న మన హీరోలకి ఏషియన్ సినిమాస్ సంస్థ సపోర్ట్ చేయడంతో వాళ్ళతో కలిసి ఈ బిజినెస్ లో ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నారు.

ముందుగా మహేష్ బాబు హైదరాబద్ గచ్చిబౌలి లో AMB సినిమాస్ అంటూ మల్టిప్లెక్స్ ని నిర్మించారు. దీంట్లో మామూలు మల్టిప్లెక్స్ తో పాటు అత్యంత ఖరీదైన స్పెషల్ స్క్రీన్ కూడా ఉంది. ఒక్కో మల్టిప్లెక్స్ లో సుమారు 4, 5 స్క్రీన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇక మహేష్ ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడంతో విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో AVD సినిమాస్ పేరుతో ఇటీవలే మల్టిప్లెక్స్ ని ఓపెన్ చేశారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ AAA సినిమాస్ పేరుతో అమీర్ పేట్ లో కొత్త మల్టిప్లెక్స్ ని నిర్మిస్తున్నారు. ఇది ఇంకా నిర్మాణ దశలో ఉంది. త్వరలోనే ఈ మల్టిప్లెక్స్ అందుబాటులోకి రానుంది.

Samantha : సినిమా చేయాలంటే కొత్త కండిషన్లు పెడుతున్న సమంత.. విడాకుల ఎఫెక్ట్??

తాజాగా రానా, వెంకటేష్ లు మహేష్ బాబుతో కలిసి మల్టిప్లెక్స్ ని నిర్మించబోతున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ X రోడ్ వద్ద `AMB విక్టరీ` పేరుతో వీరు ముగ్గురు కలిసి కొత్త మల్టీప్లెక్స్ ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీ X రోడ్ సినిమాలకి మంచి ప్లేస్. ఇక్కడ ఉన్న దేవి, సుదర్శన్ థియేటర్లలో ప్రతి సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. ఫ్యాన్స్ హంగామా చేయాల్సిందే. ఇలాంటి ప్లేస్ లో మల్టిప్లెక్స్ అంటే మంచి బిజినెస్ అనే చెప్పొచ్చు.

Sonia Gandhi : సోనియా గాంధీ బయోపిక్.. వచ్చే ఎలక్షన్స్ కి ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ??

ఈ మల్టిప్లెక్స్ లు అన్నీ ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఇలా వరుసగా స్టార్ హీరోలంతా మల్టిప్లెక్స్ రంగంలోకి దిగుతున్నారు. భవిష్యత్తులో ఇంకా చాలా మల్టిప్లెక్స్ లు వచ్చే అవకాశం ఉంది.