AK 61 : కిరాక్ కాంబినేషన్!

కోలీవుడ్ స్టార్ ‘తల’ అజిత్ కుమార్ 61వ సినిమాలో కింగ్ నాగార్జున, మోహన్ లాల్, అదితి..

AK 61 : కిరాక్ కాంబినేషన్!

Ajith 61

AK 61: కోలీవుడ్ స్టార్ ‘తల’ అజిత్ కుమార్ ‘నేర్కొండ పార్వై’ (పింక్ రీమేక్) తర్వాత వెంటనే నిర్మాత బోనీ కపూర్, దర్శకుడు హెచ్. వినోద్‌లతో కలిసి ‘వలిమై’ సినిమా చేస్తున్నారు.. అజిత్ నటిస్తున్న 60వ సినిమా ఇది.. హ్యూమా ఖురేషి ఫీమేల్ లీడ్. టాలీవుడ్ హీరో ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు..

Valimai Trailer : అజిత్ మాస్+డైరెక్టర్ బ్రెయిన్= మైండ్ బ్లోయింగ్ ట్రైలర్..

ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. పాండమిక్ కారణంగా, మధ్యలో అజిత్‌కి షూటింగ్‌లో ప్రమాదం జరగడం వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఫిబ్రవరి 24న సినిమా విడుదల కాబోతుందని కోలీవుడ్ మీడియా సమాచారం.

Shalini Ajith : అన్న, చెల్లితో అజిత్ భార్య షాలిని..

‘వలిమై’ షూటింగ్ జరుగుతుండగానే గతేడాది ఏప్రిల్‌లో మళ్లీ అదే దర్శకుడు, నిర్మాతతో మరో మూవీ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అజిత్.. తన 61వ చిత్రాన్ని వినోద్, బోనీ కపూర్‌లతో చెయ్యనున్నారు.. ఈ ముగ్గురి కలయికలో తెరకెక్కబోయే మూడో చిత్రమిది..

Ajith : 22 ఏళ్ళ తర్వాత అజిత్-టబు కాంబినేషన్లో సినిమా

లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. అజిత్ సినిమాలో మలయాళీ స్టార్, ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, కింగ్ నాగార్జున నటించబోతున్నారట. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీలో కీలకమైన సీనియర్ పోలీస్ కమీషనర్ క్యారెక్టర్ కోసం మోహన్ లాల్, నాగార్జులను నిర్మాత బోనీ కపూర్ అప్రోచ్ అయ్యారట.

Bro Daddy : హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘బ్రో డాడీ’..

వీళ్లిద్దరే కాకుండా.. అజిత్ ఇమేజ్‌కి తగ్గట్లు ఆయన పక్కన సాలిడ్ స్టార్ డమ్ ఉన్న యాక్టర్లనందరినీ ట్రై చేస్తున్నారట. హీరోయిన్‌గా అతిథి రావు హైదరి పేరు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయింది. మార్చి 9 నుండి సెట్స్ మీదకెళ్లబోతున్నారు. ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతుంది. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

RRR-DON : ఈవెంట్‌కి పిలిచి ఆ హీరో సినిమా డేట్‌కే ఎసరు పెట్టేశాడా రాజమౌళి!