ఏసీపీ విజయ్‌ వర్మ వస్తున్నాడు..

ఏసీపీ విజయ్‌ వర్మ వస్తున్నాడు..

Nagarjuna’s Wild Dog: ‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి నిర్మిస్తోన్న‌ చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. అహిషోర్ సోల్మ‌న్ డైరెక్ట్ చేస్తున్నారు. నాగ్ ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) అధికారి ఏసీపీ విజయ్‌ వర్మ పాత్రలో కనిపించనున్నారు. సయామీ ఖేర్, అలి రజా తదితరులు కీలకపాత్రల్లో నటించారు..

Nagarjuna

ఈ సినిమా మీడియా బ్రీఫ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ: ‘‘నాలైఫ్ లో లాస్ట్ ఇయర్‌ని తీసేసాను.. అందుకే మిమ్మల్ని నిన్ననే చూసినట్టు వుంది.. వీళ్ళందరితో సినిమా చెయ్యటం బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్.. సోలమన్ కథ చెప్పినప్పుడు వెంటనే ok చెప్పాను.. హైదరాబాద్‌లో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది..

Nagarjuna

బాంబ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళను పట్టుకోవడానికి ‘వైల్డ్ డాగ్’ టీమ్ పని చేస్తుంది.. ఈ టీమ్ దేనికైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారు, ప్రాణాలను సైతం లెక్కచేయని టీమ్.. నవంబర్ టైంలో సినిమా అయిపోయింది.. ఆ టైంలో ప్రేక్షకులు మళ్లీ థియేటర్స్‌కు వస్తారా అని ఆలోచించాం.. ఓటీటీ కి వెళ్దాం అనుకున్నాం.. ఇటీవల రిలీజ్ అయిన ‘క్రాక్’, ‘ఉప్పెన’ సినిమాలతో థియేటర్స్ కళకళలాడాయి.. ఒక కొత్త సినిమా తీస్తే తప్పుకుండా ప్రేక్షకులకు థియేటర్స్‌కు వస్తారు.. ఏప్రిల్ 2న మా ‘వైల్డ్ డాగ్’ రిలీజవుతోంది’’ అన్నారు..