Motorola Edge 50 Pro : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 50ప్రోపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. డోంట్ మిస్

Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఖతర్నాక్ డీల్ ఎలా పొందాలంటే?

Motorola Edge 50 Pro : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 50ప్రోపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. డోంట్ మిస్

Motorola Edge 50 Pro

Updated On : August 13, 2025 / 7:09 PM IST

Motorola Edge 50 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీరు మోటోరోలా అభిమానులు అయితే ఇది మీకోసమే.. మిడ్-రేంజ్ సెగ్మెంట్లో స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ కోసం (Motorola Edge 50 Pro) చూస్తున్నారా? ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు. 2025 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

అన్ని బ్యాంక్ డిస్కౌంట్లతో కస్టమర్‌లు ఈ మోటోరోలా ఫోన్‌పై రూ.7వేలకు పైగా ఆదా చేసుకోవచ్చు. కర్వ్డ్ 144Hz డిస్‌ప్లే, AI- పవర్డ్ ట్రిపుల్, ప్రీమియం డిజైన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర :
అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో లాంచ్ ధర రూ.27,720 కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.1,500 బ్యాంక్ డిస్కౌంట్‌ పొందవచ్చు. తద్వారా ధర రూ.26,500 తగ్గింపు ధరకు కొనుగోలు చేయొచ్చు.

Read Also : Jio Hotstar : గుడ్ న్యూస్.. ఆగస్టు 15న జియోహాట్‌స్టార్ అందరూ ఫ్రీగా చూడొచ్చు.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

కొనుగోలుదారులు తమ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి రూ.25,550 ధరకు పొందవచ్చు. కస్టమర్లు EMI ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. SBI క్రెడిట్ కార్డ్‌ ద్వారా నెలకు రూ.1,337 (2 ఏళ్ల పాటు)కు పొందవచ్చు. బ్యాంక్ ఈఎంఐ, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 1.5K pOLED ప్యానెల్‌ కలిగి ఉంది. 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ద్వారా పవర్ పొందుతుంది. ఈ మోటోరోలా ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీని అందిస్తుంది.

4,500mAh బ్యాటరీ, 125W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 50MP మెయిన్, 13MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ ఈ మోటోరోలా ఫోన్ 50MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది.