Balakrishna – Krish : క్రేజీ కాంబో.. గీతా ఆర్ట్స్‌లో బాలయ్య సినిమా!

నటసింహా నందమూరి బాలకృష్ణతో డిజిటల్ ఎంట్రీ ఇప్పిస్తున్న అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. ఆయనతో ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫిక్స్ చేశారు..

Balakrishna – Krish : క్రేజీ కాంబో.. గీతా ఆర్ట్స్‌లో బాలయ్య సినిమా!

Nbk Krish

Balakrishna – Krish: నటసింహా నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షో ప్రోమోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. బాలయ్య హోస్ట్, అదీ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కట్ చేస్తే, ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోతో వాటిని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లి కూర్చోబెట్టారు.

Unstoppable with NBK : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాలయ్య..

ఇంకో కిరాక్ న్యూస్ ఏంటంటే.. బాలయ్యతో డిజిటల్ ఎంట్రీకి శ్రీకారం చుట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇప్పుడు ఏకంగా ఆయనతో సినిమానే ప్లాన్ చేశారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ఇప్పటికే క్రిష్ – బాలయ్య కాంబోలో.. నటసింహం 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు వచ్చాయి. గతంలో ఓ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు క్రిష్‌కి గీతా ఆర్ట్స్ వారు అడ్వాన్స్ ఇచ్చారు. ఇన్నాళ్టికి ఇలా అనుకోకుండా బాలయ్య బాబుతో అరవింద్ బ్యానర్‌లో సినిమా చెయ్యబోతున్నారు. ఈ వార్త ఇప్పుడు మీడియా అండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Unstoppable with NBK : తర్వాత ఎపిసోడ్స్ గెస్టులు వీళ్లే..