New Villains: హైలెట్‌గా విలనిజం.. అందుకోసమే స్టైలిష్ స్టార్స్!

పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీస్తుంటే.. హీరోలకు తగ్గ విలన్స్ ను సెట్ చేయడం చిన్న విషయం కాదు. అందుకే స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తుంటే.. ఆ హీరోను ఢీకొట్టే ప్రతినాయకుడి కోసం..

New Villains: హైలెట్‌గా విలనిజం.. అందుకోసమే స్టైలిష్ స్టార్స్!

New Villains

New Villains: పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీస్తుంటే.. హీరోలకు తగ్గ విలన్స్ ను సెట్ చేయడం చిన్న విషయం కాదు. అందుకే స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తుంటే.. ఆ హీరోను ఢీకొట్టే ప్రతినాయకుడి కోసం గట్టిగా కసరత్తులు చేస్తున్నారు మేకర్స్. పక్క ఇండస్ట్రీల నుంచి స్టైలిష్ విలన్స్ ను మన వాళ్ల కోసం ఫిక్స్ చేస్తున్నారు.

Shyam Singha Roy: ఈ శుక్రవారం నుండే ఓటీటీలో శ్యామ్ సింగరాయ్!

మహేశ్, త్రివిక్రమ్ మూవీ ఏప్రిల్ లో సెట్స్ పైకెళ్లబోతుంది. ఈలోపు సినిమాకు కావాల్సిన సెటప్ ను దగ్గరుండి చూసుకుంటున్నారు త్రివిక్రమ్. అందులో భాగంగానే పాన్ ఇండియా టచ్ ఇచ్చేందుకు మహేశ్ కు విలన్ గా సునీల్ శెట్టిని సెట్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే మంచు విష్ణు మోసగాళ్లుతో పాటూ త్వరలో రిలీజ్ కాబోతున్న గనిలో సునీల్ శెట్టి నెగెటివ్ క్యారెక్టర్ చేశాడు. ఇక సూపర్ స్టార్ కోసం రాజమౌళి ఏకంగా తమిళ్ స్టార్ విక్రమ్ నే విలన్ గా మార్చబోతున్నట్టు తెలుస్తోంది.

Mahesh Babu: తగ్గేదేలే.. స్టార్ డైరెక్టర్స్‌ను లైన్‌లో పెట్టేసిన మహేష్!

ఉప్పెన రాయణం.. పవర్ స్టార్ తో తలపడితే ఎలా ఉంటుంది. అది చూపించాలనే స్కెచ్ వేశాడు హరీశ్ శంకర్. పవన్ కల్యాణ్ తో ఆయన తీస్తున్న భవధీయుడు.. భగత్ సింగ్ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతిని సంప్రదించారు. ఉప్పెన, మాస్టర్ తర్వాత కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు మక్కల్ సెల్వన్. అటు హీరోగానూ తమిళ్ తో పాటూ బాలీవుడ్ లోనూ బిజీగా ఉన్నారు. మరి పవర్ స్టార్ తో ఢీకొట్టేందుకు డేట్స్ అడ్జస్ట్ చేస్తారా చూడాలి.

Rakul Preet Singh: కొంటె చూపులతో చంపేస్తున్న రకుల్!

బాలయ్య నెక్ట్స్ సినిమాలో విలన్ గా దునియా విజయ్ ను ఆల్రెడీ ఫిక్స్ చేశారు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కన్నడ స్టార్ దునియా విజయ్, బాలయ్య మధ్య సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. అటు క్రాక్ జయమ్మ వరలక్ష్మీ శరత్ కుమార్ సైతం బాలయ్యకు ఎదురొచ్చే లేడీ విలన్ గా నటిస్తుంది.

Deepthi Sunaina: లంగా ఓణీలో దీప్తి సునయన క్యూట్ లుక్స్!

రవితేజ సినిమాకొక విలన్ ను సెట్ చేసుకుంటున్నాడు. ఖిలాడీలో మలయాళీ యాక్టర్ ఉన్ని ముకుందన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. రావణాసురలో అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇందులోనే హీరోయిన్ దక్షా నగర్కార్ లేడీ విలన్ గా నటిస్తుంది. అటు శరత్ మండవ తెరకెక్కిస్తున్న రామారావ్ ఆన్ డ్యూటీలో ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి ప్రతినాయకుడిగా కొత్త అవతారం ఎత్తబోతున్నారు. రవితేజ డ్యూయెల్ రోల్ చేస్తున్న ధమాకాలో సీనియర్ హీరో అర్జున్, యాంకర్ అనసూయ నెగెటివ్ షేడ్స్ చూపిస్తారని అంటున్నారు.

Star’s Negative Rolls: హీరోలే విలన్లు.. విలన్లే హీరోలు!

ఆరడుగుల మాస్ కటౌట్ ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ కోసం స్టైలిష్ విలన్స్ ని సెట్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఆదిపురుష్ లో రాముడిగా నటించిన రెబల్ స్టార్ ను.. రావణుడిగా ఎదిరించబోతున్నాడు సైఫ్ అలీఖాన్. సలార్ సినిమాలో మలయాళీ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ తో ప్రభాస్ చేసే యాక్షన్ సీక్వెన్స్ అదిపోతుందనే సమాచారం ఉంది. వీటి కోసమే ప్రశాంత్ నీల్ దాదాపు 20 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

Telugu Heroins: ఆన్ స్క్రీనైనా.. ఆఫ్ స్క్రీనైనా.. పెంచేసిన గ్లామర్ డోస్!

విజయ్ దేవరకొండ లైగర్ మూవీలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారనుకున్నారు. కానీ మైక్ టైసన్ రౌడీబాయ్ ను ఢీకొట్టే క్రేజీ విలన్ గా కనిపించబోతున్నారని బాలయ్య అన్ స్టాపబుల్ లో న్యూస్ రివీలైంది. ఈ లెక్కన విజయ్, మైక్ టైసన్ మధ్య వచ్చే సీన్స్ ను పూరీ జగన్నాథ్ ఏ లెవల్లో ట్రీట్ చేసుంటారో ఊహించుకుంటేనే ప్యాన్స్ లో గూస్ బంప్స్ వస్తున్నాయి.

Aishwarya Dhanush: ధనుష్, ఐశ్వర్య విడాకులకు కారణమిదేనా? మళ్ళీ కలుస్తారా?

రామ్ – లింగుస్వామి కాంబినేషన్ లో వస్తున్నది వారియర్ మూవీలో ఆది పినిశెట్టి.. స్టైలిష్ విలన్ గా కన్నింగ్ నెస్ చూపించబోతున్నాడు. పుష్ప పార్ట్ 2లో ఫహాద్ ఫాజిల్ విలనిజం హైలైట్ కాబోతుంది. ఆచార్యలో సోనూసూద్.. సర్కారు వారి పాటలో సముద్రఖని.. భీమ్లా నాయక్ లో రానా.. ఇలా హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలంటే విలనిజాన్ని హైలైట్ చేయాలని డిసైడ్ అయ్యారు టాలీవుడ్ డైరెక్టర్స్.