Radhe Shyam: ఫైట్స్, ఛేజింగ్స్ ఉండవు.. ముందే ప్రిపేర్ చేసిన డైరెక్టర్!

మోస్ట్ అవైటైడ్ మూవీ రాధేశ్యామ్ ట్రైలర్ వచ్చేసింది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ఈ మూవీ ట్రైలర్ ను వాళ్లతోనే రిలీజ్ చేయించి నిజంగానే డార్లింగ్ అనిపించుకున్నారు ప్రభాస్.

Radhe Shyam: ఫైట్స్, ఛేజింగ్స్ ఉండవు.. ముందే ప్రిపేర్ చేసిన డైరెక్టర్!

Radhe Shyam

Radhe Shyam: మోస్ట్ అవైటైడ్ మూవీ రాధేశ్యామ్ ట్రైలర్ వచ్చేసింది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ఈ మూవీ ట్రైలర్ ను వాళ్లతోనే రిలీజ్ చేయించి నిజంగానే డార్లింగ్ అనిపించుకున్నారు ప్రభాస్. స్టార్ గెస్ట్ లు ఎవరూ లేకుండా.. తను వర్క్ చేస్తోన్న డైరెక్టర్స్ ని పిలిపించి.. ప్రీరిలీజ్ ఈవెంట్ లో తనదైన మార్క్ చూపించారు గ్లోబల్ స్టార్. మొత్తానికి రాధేశ్యామ్ యూనిట్ ఇన్నాళ్లకి ఫ్యాన్స్ ముందుకొచ్చింది. స్టార్ గెస్ట్ లు ఎవరూ లేకుండా రాధేశ్యామ్ ట్రైలర్ ను అన్ని భాషల్లో ఫ్యాన్స్ తో రిలీజ్ చేయించారు ప్రభాస్. ఈ సినిమాలో పరమహంసగా నటిస్తోన్న రెబల్ స్టార్ కృష్ణంరాజుతో కౌంట్ డౌన్ చేయించి… ఫ్యాన్స్ మొబైల్స్ ఫ్లాష్ లైట్స్ వెలుగుల్లో రాధేశ్యామ్ ట్రైలర్ బయటికొచ్చింది.

Bollywood Heroins: కొత్త సంవత్సరం.. బీ టౌన్ లవ్ బర్డ్స్ డేరింగ్ డెసిషన్స్!

విక్రమాధిత్య – ప్రేరణల ఇంటెన్స్ లవ్ స్టోరీని ఫుల్ ట్విస్ట్ లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో డైరెక్టర్ రాధాకృష్ణ చూపించబోతున్నాడని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సాధారణంగా సినిమాలకు ఫైనాన్సర్స్‌ ఉంటారని, ప్రభాస్‌ సినిమాలకు మాత్రం ఫైనాన్స్‌ మినిస్టర్స్‌ ఉంటారని ఫన్ క్రియేట్ చేశాడు నవీన్‌ పొలిశెట్టి. రాధేశ్యామ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హోస్ట్‌గా ఎంటర్ టైన్ చేసిన నవీన్ ప్రభాస్‌ సినిమాల బడ్జెట్‌ గురించి సరదా చేశాడు. హెల్త్‌ కోసం 500 కోట్లు, ఎడ్యుకేషన్‌కు 500 కోట్లను కేటాయించినట్టే ఇకపై పార్లమెంట్‌లో ప్రభాస్‌ అన్న సినిమా కోసం 2000 కోట్లు కేటాయించండి సర్‌’అంటూ ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చాడు.

Films Re-Shoot: రీ షూట్.. ప్యాకప్ చెప్పిన సినిమాలకు మళ్ళీ ప్యాచప్!

అలాగే సినిమాల్లో క్లాస్, మాస్ అనే రెండు క్యాటగిరీలే కాదు.. ప్రభాస్ అనే మూడో క్యాటగరీ ఉందంటూ పంచ్ ఇచ్చాడు. ఈవెంట్ మొత్తం సింప్లీ స్మైల్ తో కనిపించిన ప్రభాస్.. రాధేశ్యామ్ అందరికీ నచ్చుతుందన్నారు. కొవిడ్‌ టైంలో అందరూ చాలా కష్టపడి చేశారని.. రెండేళ్ల పాటు అటు జార్జియాలో.. ఇటు హైదరాబాద్‌లో షూటింగ్ చేశామన్నారు. ఇందులో జగపతిబాబు గెస్ట్ గా నటించారనే సీక్రెట్ రివీల్ చేశారు గ్లోబల్ స్టార్. సినిమాలో చాలా ట్విస్ట్‌లు ఉన్నాయని.. క్లైమాక్స్‌ హైలైట్ అంటూ హైప్ క్రియేట్ చేశారు రాధేశ్యామ్ స్టార్.

Kiara Advani: కైరా అద్వానీ కొత్త సోయగాలు!

ఓ పిలాసఫీని లవ్ స్టోరీలా మార్చి ప్రభాస్ కి చెప్తే నచ్చిందని.. అదే రాధేశ్యామ్ లా మీముందుకొచ్చిందన్నారు డైరెక్టర్ రాధాకృష్ణ. ఈ సినిమా తీయడానికి 4 ఏళ్లు పడితే.. రాయడానికి 18 ఏళ్లు పట్టిందని ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ కొట్టారు. పామిస్ట్ గా డార్లింగ్ కనిపించబోతున్న ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్స్, ఛేజింగ్ సీన్స్ ఉండవని ఫ్యాన్స్ ను ముందే ప్రిపేర్ చేశారు డైరెక్టర్. ట్రైలర్ సినిమాకు ఇన్విటేషన్ కార్డే అని.. అంతకు మించి అన్న లెవెల్ లో రాధేశ్యామ్ ఉండబోతుందని ఎక్స్ పెక్టేషన్స్ పీక్ కి తీసుకెళ్లారు.

RRR: ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా ప్రచారం.. నిజమెంత?

ప్రేక్షకులకు, తన ఫ్యాన్స్ కు కొత్తదనం అందించడమే ప్రభాస్ లక్ష్యమంది పూజా హెగ్డే. ఈమధ్య వైరలైనట్టు ప్రభాస్, పూజాహెగ్డే మధ్య గొడవలేమి లేవని ఈ ఈవెంట్ లో వాళ్ల కెమిస్ట్రీ చూస్తే తెలుస్తోంది. సంక్రాంతి తనకు చాలా లక్కీ అని.. ఈసారి అది నిజమవుతుందని పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చింది పూజాహెగ్డే. రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి బిగ్ స్టార్స్ గెస్ట్ లుగా రాకపోయినా… ప్రభాస్ ప్రెజెంట్ డైరెక్టర్స్ మెరిసారు. ప్రాజెక్ట్ కె నాగ్ అశ్విన్, స్పిరిట్ సందీప్ రెడ్డి వంగా, ఆదిపురుష్ ఓం రౌత్ లు ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. వాళ్ల సినిమాలు కూడా ప్రబాస్ కటౌట్ కి తగ్గట్టు భారీ రేంజ్ లో సెట్ చేస్తున్నట్టు ఫ్యాన్స్ కి హింట్ ఇచ్చారు.