Pushpa : ‘పుష్ప’ కోసం ఓవరాల్ ఇండియా వెయిట్ చేస్తోంది..!

మోస్ట్ యాంటిసిపెటెడ్ ఇండియన్ మూవీగా IMDBలో రెండో ప్లేస్‌లో ఉంది ‘పుష్ప’..

Pushpa : ‘పుష్ప’ కోసం ఓవరాల్ ఇండియా వెయిట్ చేస్తోంది..!

Pushpa

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయిక.. పాపులర్ మలయాళం యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు.

Pushpa Raj : రిలీజ్‌కి ముందే రికార్డ్.. పుష్ప.. ‘తగ్గేదే లే’…

బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘పుష్ప రాజ్’ ఇంట్రో వీడియో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. లెంగ్త్ ఎక్కువగా ఉండడంతో రెండు పార్టులుగా ‘పుష్ప’ ప్రేక్షకుల ముందుకు వస్తుందని సుకుమార్ కన్ఫమ్ చేసేశారు.

‘పుష్ప రాజ్’ ఇంట్రో వీడియో రిలీజ్ చేసిన అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకోవడమే కాక రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇప్పుడు రిలీజ్‌కి ముందే మరో రేర్ ఫీట్ సాధించిందీ సినిమా.. మోస్ట్ యాంటిసిపెటెడ్ ఇండియన్ మూవీగా IMDBలో రెండో ప్లేస్‌లో ఉంది ‘పుష్ప’.

Pushpa : ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్.. పది ‘కె.జి.యఫ్’ లతో సమానం.. బుచ్చిబాబు సెన్సేషనల్ కామెంట్స్..!

కేవలం తెలుగు ఆడియెన్స్, బన్నీ ఫ్యాన్సే కాదు.. ఓవరాల్ ఇండియా ‘పుష్ప’ సినిమా కోసం వెయిట్ చేస్తుంది. సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్‌పోన్ అయిన ‘పుష్ప’ షూటింగ్ త్వరలో పున: ప్రారంభం కానుంది. ఫస్ట్ పార్ట్‌కి సంబంధించి 20 రోజుల షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు.