Pushpa : ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్.. పది ‘కె.జి.యఫ్’ లతో సమానం.. బుచ్చిబాబు సెన్సేషనల్ కామెంట్స్..!

‘పుష్ప’ మీద ఇప్పటికే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.. ఆ అంచనాలు ఆకాశాన్నంటేలా కామెంట్స్ చేశాడు సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా..

Pushpa : ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్.. పది ‘కె.జి.యఫ్’ లతో సమానం.. బుచ్చిబాబు సెన్సేషనల్ కామెంట్స్..!

Uppena Movie Director Buchi Babu Sana About Pushpa 1

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయిక.. పాపులర్ మలయాళం యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు. బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘పుష్ప రాజ్’ ఇంట్రో వీడియో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. లెంగ్త్ ఎక్కువగా ఉండడంతో రెండు పార్టులుగా ‘పుష్ప’ ప్రేక్షకుల ముందుకు వస్తుందని సుకుమార్ కన్ఫమ్ చేసేశారు.

బన్నీ – సుక్కుల కాంబోలో వస్తున్న ‘పుష్ప’ మీద ఇప్పటికే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలు ఆకాశాన్నంటేలా కామెంట్స్ చేశాడు సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా.. రీసెంట్‌గా ఓ ఇంటర్వూకి సంబంధించి జూమ్ వీడియోలో మాట్లాడుతూ ‘పుష్ప’ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు బుచ్చిబాబు..

‘పుష్ప’ పార్ట్ 1.. కన్నడ నాట ట్రెండ్ సెట్ చేసి, ఇండియా వైడ్ పిచ్చ క్రేజ్ తెచ్చుకున్న ‘కె.జి.యఫ్’ సినిమా కంటే అదిరిపోతుందట.. ‘‘పది ‘కె.జి.యఫ్’ లు కలిస్తే ‘పుష్ప’ – 1 అలా ఉంటుంది.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో చెయ్యని పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్ గారు ‘పుష్ప’ లో చేశారు. నా గురువు సుకుమార్ గారి మీద చాలా జలస్‌గా ఉంది. అంత బాగా రాశారు కథ’’.. అంటూ బన్నీ ఫ్యాన్స్‌కి బూస్టప్ ఇచ్చేలా, అంచనాలు ఎవరెస్ట్‌ని తాకేలా కామెంట్స్ చేసాడు బుచ్చిబాబు.