Gold Silver Price Today : వరుసగా రెండోరోజు బిగ్ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. వరుసగా రెండోరోజు గోల్డ్న సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి.
Gold Silver Price
Gold Silver Price Today : బంగారం, వెండి ధరలు మళ్లీ చుక్కలు చూపిస్తున్నాయి. గత వారం భారీగా తగ్గుతూ వచ్చిన వీటి ధరలు.. ప్రస్తుతం రెండు రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఈరోజు బులియన్ మార్కెట్ ప్రారంభం కాగానే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ కదలికలు, అంతర్జాతీయ డిమాండ్ వంటి అంశాలు బంగారం పెరుగుదలకు కారణమవుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.500 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.370 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 10 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,222 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి రేటు కూడా భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.5వేలు పెరిగింది. శుక్రవారం కూడా కిలో వెండిపై రూ.5వేలు పెరగ్గా.. శుక్ర, శనివారాల్లో కలిపి కిలో వెండిపై రూ. 10వేలు పెరుగుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,49,080 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,36,65 వద్దకు పడిపోయింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,230 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,36,800 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,51,200కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,38,600కు చేరింది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,70,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,70,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
