Pushpa Raj : రిలీజ్‌కి ముందే రికార్డ్.. పుష్ప.. ‘తగ్గేదే లే’…

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ అండ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’..

Pushpa Raj : రిలీజ్‌కి ముందే రికార్డ్.. పుష్ప.. ‘తగ్గేదే లే’…

Pushpa Raj

Updated On : April 27, 2021 / 1:50 PM IST

Pushpa Raj: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ అండ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయిక.. పాపులర్ మలయాళం యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు..

Introducing Pushpa Raj The First Meet

బన్నీ బర్త్‌డేకి రిలీజ్ చేసిన ‘పుష్ప’ రాజ్ ఇంట్రడక్షన్ టీజర్ అదిరిపోయిందంటూ సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.. రీసెంట్‌గా బన్నీ బ్రహ్మాండమైన రికార్డ్ క్రియేట్ చేశాడు.. ‘పుష్ప’ రాజ్ ఇంట్రో వీడియో 50 మిలియన్ల మార్క్ టచ్ చేసింది.. టాలీవుడ్ హిస్టరీలో, యూట్యూబ్‌‌లో ఫాస్టెస్ట్ 50 మిలియన్ల వ్యూస్ రాబట్టిన ఫస్ట్ ఫిలిం ‘పుష్ప’ నే కావడం విశేషం.. 1.2 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి..

Pushpa : ‘పుష్ప’ కోసం ఎవరు ఎంతెంత తీసుకుంటున్నారంటే!..

‘పుష్ప’ లో బన్నీ ఊరమాస్ గెటప్‌లో సరికొత్తగా కనిపించనున్నాడు.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.. కోవిండ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా వేశారు..