Koratala Siva: ఆచార్య గుణపాఠం.. కొరటాలకి అగ్ని పరీక్షగా ఎన్టీఆర్ సినిమా!

ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే, అది స్టార్ హీరోల క్రెడిట్.. అదే ఫ్లాప్ అయితే డైరెక్టర్ డిఫీట్. అలాంటి పరిస్తితే కొరటాల శివ ఫేస్ చేస్తున్నాడా..? ఆచార్య ఫ్లాప్ ప్రభావం కొరటాల మీద పడిందా?

Koratala Siva: ఆచార్య గుణపాఠం.. కొరటాలకి అగ్ని పరీక్షగా ఎన్టీఆర్ సినిమా!

Koratala

Koratala Siva: ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే, అది స్టార్ హీరోల క్రెడిట్.. అదే ఫ్లాప్ అయితే డైరెక్టర్ డిఫీట్. అలాంటి పరిస్తితే కొరటాల శివ ఫేస్ చేస్తున్నాడా..? ఆచార్య ఫ్లాప్ ప్రభావం కొరటాల మీద పడిందా? అజ్నాతవాసి తర్వాత త్రివిక్రమ్ ఎదుర్కొన్న సిచ్యుయేషనే కొరటాల ఎదుర్కోబోతున్నాడా? ఇలాంటి క్వశ్ఛన్స్ కి ఆన్సర్స్ కావాలంటే డిటైల్డ్ స్టోరీలోకి ఎంటరైపోవాలి.

NTR30: మే 20 తారక్ బర్త్ డే.. అదే రోజున కొరటాల మూవీ కంప్లీట్ డిటైల్స్!

హీరోయిజాన్ని ఎలివేషన్స్ తో కన్నా, ఎమోషన్స్ తో ఎస్టాబ్లిష్ చేసే అతికొద్ది మంది డైరెక్టర్స్ లో కొరటాల శివ ఒకరు. ఆయన రైటర్ కమ్ డైరెక్టర్ గా వరసగా నాలుగు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అయిదో సినిమాగా వచ్చిన ఆచార్యతో తన సక్సెస్ ఫుల్ జర్నీకి బ్రేక్ పడింది. ఆచార్య డివైడ్ టాక్ తో యావరేజ్ సక్సెస్ కే పరిమితమైంది. తప్ప ఊహించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోయింది. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ లాంటి మాస్ హీరోలతో తన క్లాస్ ఫార్ములా వర్కవుట్ చేయలేక పోయాడు కొరటాల శివ.

NTR30: ఈ నెలలో అలియా పెళ్లి.. ఎన్టీఆర్ కోసం మరో భామ?

ఆచార్య డివైడ్ టాక్ ప్రభావం కొరటాల శివ మీద తీవ్రంగా పడింది. నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమాకి అగ్ని పరీక్ష ఎదురైంది. అజ్నాతవాసి సినిమా తర్వాత త్రివిక్రమ్ ఫేస్ చేసిన సేమ్ సిచ్యుయేషన్ ఇప్పుడు కొరటాల శివ ఫేస్ చేస్తున్నాడు. అజ్నాతవాసి ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేశాడు. గడ్డు పరిస్తితిలో అరవింద సమేతతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు త్రివిక్రమ్. సో ఇప్పుడు కొరటాల కూడా ఎన్టీఆర్ సినిమానే చేస్తున్నాడు. కొరటాల కూడా కుంభస్థలాన్ని బద్ధలు కొట్టాలని చూస్తున్నారు.

NTR30: కొత్త సినిమా మొదలెప్పుడు తారక్.. అభిమానుల ఆవేదన!

ప్రజెంట్ ఎన్టీఆర్ కు ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ఎన్టీఆర్ క్రేజ్ ను రీచ్ అయ్యేలా ఇప్పుడు కొరటాల శివ, ఎన్టీఆర్ ను పాన్ ఇండియా స్టార్ గానే ఢీల్ చేస్తున్నారు. యూనివర్శల్ మాస్ సబ్జెక్ట్ తో సినిమా చేయాలనే చూస్తున్నారు. సో దాని కోసం కొరటాల కేర్ ఫుల్ గా స్క్రిప్ట్ వర్క్ మీద కూర్చున్నట్టు సమాచారం. ఆల్రెడీ ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్ హిట్ కొట్టిన కొరటాల ఇప్పుడు తన స్టైల్ మార్చుకుని, పాన్ ఇండియా రేంజ్ సినిమా చేయాలని కోరుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ సినిమాతోనే కొరటాల మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యి టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో కంటిన్యూ అవుతారని కాన్ఫిడెంట్ తో ఉన్నారు కొరటాల ఫ్యాన్స్.