The Warrior: అఫీషియల్.. రామ్ ది వారియర్ రిలీజ్ డేట్ అనౌన్స్!

ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ తమిళ స్టార్ డైరెక్టర్ ఎన్.లింగుస్వామితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ నటిస్తున్న 19వ సినిమా ఇది. ఈ మూవీ కోసం రామ్ సరికొత్తగా..

The Warrior: అఫీషియల్.. రామ్ ది వారియర్ రిలీజ్ డేట్ అనౌన్స్!

The Warrior

The Warrior: ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ తమిళ స్టార్ డైరెక్టర్ ఎన్.లింగుస్వామితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ నటిస్తున్న 19వ సినిమా ఇది. ఈ మూవీ కోసం రామ్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. పవన్ కుమార్ సమర్పణలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృతి శెట్టి, అక్షర గౌడ కథానాయికలు. ఆది పినిశెట్టి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు. కెరీర్‌లో ఫస్ట్ టైం రామ్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు.

The Warriorr: యాక్షన్ సినిమానే కానీ హీరో మతి మరుపు పోలీస్?

ఇప్పటికే మేకర్స్ నుండి వచ్చిన పోస్టర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా.. పోలీస్ గెటప్‌లో రామ్ లుక్ అదిరిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ‘ది వారియర్’ రామ్ కెరీర్‌లో ఓ డిఫరెంట్ సినిమా అవుతుందని ధీమాగా చెప్తున్న మేకర్స్.. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూలై 14న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఓ పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్ ప్రకటించగా అందులో రామ్ గన్ చేతబట్టి సీరియస్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.

The Warrior: వారియర్ అవతారం.. చాలా ఆశలే పెట్టుకున్న రామ్!

గతేడాది జులై 13న షూటింగ్ ను ప్రారంభించిన ఈ సినిమా ఈ ఏడాది జులై 14న రిలీజ్ కానుంది. సరిగ్గా ఏడాదిలో సినిమాను రిలీజ్ చేయడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.16 కోట్ల రూపాయలకి అమ్ముడైనట్లు తెలుస్తోండగా.. తెలుగు, తమిళ భాషలకు కలిపి డిస్నీ హాట్ స్టార్ రూ.35 కోట్లకు డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. మొత్తంగా డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రూపేణా.. నాన్ థియేట్రికల్‌గా ఇప్పటికే ఈ సినిమాకు రూ.41 కోట్ల టేబుల్ ప్రాఫిట్ కు అమ్ముడైనట్లు టాక్ నడుస్తుండగా.. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో రామ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.