The Warrior: వారియర్ అవతారం.. చాలా ఆశలే పెట్టుకున్న రామ్!

ర్యాపో19 ఫస్ట్ లుక్ తో రచ్చ చేస్తున్నాడు రామ్. పవర్ ఫుల్ పోలీసాఫీసర్.. ది వారియర్ అవతారం ఎత్తాడు ఎనర్జిటిక్ స్టార్. ఇస్మార్ట్ శంకర్, రెడ్ తర్వాత అంతకుమించి అన్న లెవెల్ లో...

The Warrior: వారియర్ అవతారం.. చాలా ఆశలే పెట్టుకున్న రామ్!

The Warrior

The Warrior: ర్యాపో19 ఫస్ట్ లుక్ తో రచ్చ చేస్తున్నాడు రామ్. పవర్ ఫుల్ పోలీసాఫీసర్.. ది వారియర్ అవతారం ఎత్తాడు ఎనర్జిటిక్ స్టార్. ఇస్మార్ట్ శంకర్, రెడ్ తర్వాత అంతకుమించి అన్న లెవెల్ లో లింగుస్వామి సినిమా ఉండబోతుంది. దానికి తగ్గట్టే ఫస్ట్ లుక్ కొస్తున్న రెస్పాన్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది.

Bangarraju: అక్కినేని హీరోలకు బంగారు బాతుగా సంక్రాంతి!

ది వారియర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు ర్యాపో19 ప్రాజెక్ట్ కి. ఈ సినిమాలో రామ్.. పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నట్టు ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తోంది. గతేడాది సంక్రాంతికి రెడ్ చూపించిన రామ్.. ఈసారి మాత్రం కొత్త సినిమా ఫస్ట్ లుక్ తో సరిపెట్టాడు. అయినాసరే టైటిల్ లుక్ ని సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రెండ్ చేస్తున్నారు రామ్ పోతినేని ఫ్యాన్స్.

NTR 30: తారక్ జోడీగా నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో మరో క్రేజీ ఆఫర్!

నిజానికి రామ్ – లింగుస్వామి కాంబినేషన్ పై ఫస్ట్ నుంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రెడ్ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినా లింగుస్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రామ్. కథ, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుందని కూడ చెప్తున్నారు. అందుకే ఫస్ట్ టైమ్ డైరెక్ట్ గా తెలుగు, తమిళ్ భాషల్లో రామ్ సినిమా తెరకెక్కుతోంది. ది వారియర్ మూవీతో మరో లెవెల్ కి వెళ్లాలనేది రామ్ ప్లాన్. ఇది సక్సెస్ అయితే నెక్ట్స్ పాన్ ఇండియా రేస్ లోకి ఈజీగా అడుగేయొచ్చు.

Ala Vaikunthapurramuloo: పుష్ప ఇచ్చిన జోష్.. హిందీలో బన్నీ సినిమా!

రామ్ జోడీగా కృతిశెట్టి నటిస్తోంది. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న కృతిశెట్టి ఈ సినిమాకు కూడా లక్కీ ఛార్మ్. ఇక ఆది పినిశెట్టి రామ్ ను ఢీకొట్టే విలన్ గా కనిపించబోతున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ వారియర్ కి ప్లస్ కాబోతుంది. గతంలో రామ్ – దేవీశ్రీ కాంబోకి సక్సెస్ ట్రాక్ ఉంది. జగడం నుంచి హలో గురూ ప్రేమ కోసమే వరకు మొత్తం 6 సినిమాలొచ్చాయి. ఇప్పుడు రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కు కూడా రాక్ స్టార్ మ్యూజిక్ హైలెట్ కావడం ఖాయం.