RRR: నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. ఆర్ఆర్ఆర్ నుండి మరో పాట

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందిన భారీ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే కరోనా కారణంగా ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన..

RRR: నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. ఆర్ఆర్ఆర్ నుండి మరో పాట

Rrr

RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందిన భారీ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే కరోనా కారణంగా ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది. బాలీవుడ్, హాలీవుడ్ స్టార్లు సైతం నటించి, ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వచ్చే సినిమా కావడంతో దేశమంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

RRR: క్రేజీ మల్టీస్టారర్‌కు రెండే వారాలు.. జక్కన్నా ఇక నీదే లేట్!

మార్చి 25న ఈ సినిమా విడుదల కానుండగా.. మరో రెండు వారాలు మాత్రమే ఉండడంతో ఆర్ఆర్ఆర్ టీం ప్రమోషన్ మొదలు పెట్టింది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం గతంలో భారీగా ఖర్చు పెట్టగా మరోసారి ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈక్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి కొత్త పాట రానుంది. మార్చి 14న ఎత్తరా జెండా అనే పాటని విడుదల చేయనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సెలెబ్రేషన్ యాంతం అంటూ ఈ పాటని రిలీజ్ చేయనుండగా.. శనివారం సాంగ్ ప్రోమో విడుదల చేశారు.

RRR: ప్రమోషన్స్‌తో దూసుకుపోనున్న ఆర్ఆర్ఆర్ టీమ్

ప్రోమోను బట్టి చూస్తే.. నెత్తురు మరిగితే ఎత్తర జెండా..సత్తువ ఉరిమితే కొట్టర కొండ అంటూ సాగే ఈ పాట మంచి దేశభక్తి గీతంలా కనిపిస్తుంది. ఈ పాట రిలీజ్ తో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు మొదలు పెట్టనుండగా.. మరో ట్రైలర్ కూడా విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ భారీ క్రేజీ మల్టీస్టారర్ కోసం అభిమానులతో పాటు, దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తుండగా.. ఈలోపు సినిమా నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా భారీ రెస్పాన్స్ దక్కుతుంది.