RRR: క్రేజీ మల్టీస్టారర్‌కు రెండే వారాలు.. జక్కన్నా ఇక నీదే లేట్!

మార్చ్ 25న ఆడియెన్స్ ముందుకొస్తున్న ట్రిపుల్ ఆర్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇంక్రీస్ అవుతున్న ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ హడావిడి రోజు రోజుకీ పెరిగిపోతోంది.

RRR: క్రేజీ మల్టీస్టారర్‌కు రెండే వారాలు.. జక్కన్నా ఇక నీదే లేట్!

RRR

RRR: మార్చ్ 25న ఆడియెన్స్ ముందుకొస్తున్న ట్రిపుల్ ఆర్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇంక్రీస్ అవుతున్న ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ హడావిడి రోజు రోజుకీ పెరిగిపోతోంది. రాధేశ్యామ్ వచ్చేయడంతో జక్కన్న టీమ్ ఇప్పుడు ప్రమోషన్స్ స్పీడ్ పెంచే పనిలో ఉంది. ప్రమోషన్స్ మాస్టర్ ప్లాన్ రెడీ చేసి ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసేందుకు కసరత్తులు షురూ చేసింది.

RRR: ప్రమోషన్స్‌తో దూసుకుపోనున్న ఆర్ఆర్ఆర్ టీమ్

తారక్, చరణ్, రాజమౌళి అభిమానులకు కౌంట్ డౌన్ స్టార్టయింది. నాలుగు సంవత్సరాల సినిమా, మూడు సంవత్సరాల మేకింగ్. ఇంకా రెండు వారాల్లో సిల్వర్ స్క్రీన్ పైన బొమ్మ పడనుంది. ఈ లోగా ఈ సినిమా నుంచి ఏమేం కొత్త అప్ డేట్స్ వస్తాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫాన్స్. రాధేశ్యామ్ రిలీజ్ అయిన వెంటనే ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ ఎఫెక్ట్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మార్చి 14న ఎత్తర జెండా కొట్టర కొండ అనే సెలబ్రేషన్ అంతెమ్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. తారక్, చరణ్ తో పాటు ఆలియా భట్ కూడా పాడడానికైనా, ఆడడానికైనా సై అన్నట్టు తమ ఎనర్జీ షో చేస్తున్న పోస్టర్ వదిలి, ఫాన్స్ లో కొత్త హంగామా షురూ చేశారు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ మొదలు.. ‘ఎత్తరా జెండా’ అంటున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం..

పనిలో పనిగా ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేసి రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో ట్రిపుల్ ఆర్ ని కూడా ప్రమోట్ చేసుకున్నారు రాజమౌళి. మార్చి 14 నుంచి నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేయడానికి రెడీ అయిపోయారు. లార్జ్ స్కేల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేశారు. మార్చి 18న, 19న ఈ ఈవెంట్స్ దుబాయ్ లోనూ, బెంగుళూరులోనూ జరగనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటూ మరికొన్ని ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ కూడా మేకర్స్ లిస్ట్ లో ఉన్నాయి. ప్రస్తుతం పివిఆర్ థియేటర్స్ లో రన్ అవుతోన్న సినిమాల షోకు ముందే ట్రిపుల్ ఆర్ కౌంట్ డౌన్ టీజర్ పడుతుంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో లాగానే సౌత్ టు నార్త్ ప్రమోషన్స్ పీక్స్ కు చేరుకోబోతున్నాయి. మళ్లీ ఓసారి ట్రిపుల్ ఆర్ టీమ్ ను బాలీవుడ్ లో ప్రమోట్ చేయడానికి కరణ్ జోహార్ లాంటి వారు కూడా వెయిట్ చేస్తున్నారు.

RRR: అమెరికాలో మొదలైన ఆర్ఆర్ఆర్ రచ్చ.. రికార్డ్ బుకింగ్స్!

బాహుబలి 2 తర్వాత తెలుగులో సెకండ్ టైమ్ ఐమాక్స్ లార్జ్ స్కేల్ వెర్షన్ లో విజువల్ వండర్ గా ట్రిపుల్ ఆర్ రిలీజ్ కానుంది. ఎంటైర్ ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఈ నెల 24న ప్రీమియర్ షో పడనున్న ఈ సినిమా 25న ఇండియావైడ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రయిలర్, సాంగ్స్ ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. 14న రాబోతున్న మాస్ సాంగ్ తో పాటు ఈ సినిమా ఎన్ని రికార్డులు తిరగ రాస్తుందో అని అంచనాలేసుకుంటున్నారు ట్రిపుల్ ఆర్ ఫాన్స్.