OnePlus 10 Pro 5G : అమెజాన్‌లో వన్‌ప్లస్ 10ప్రో 5G ఫోన్‌పై రూ. 6,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్.. ఇప్పుడే కొనుక్కోండి.. డోంట్ మిస్..!

OnePlus 10 Pro 5G Sale : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ (Amazon) భారీ డీల్స్ అందిస్తోంది. మరోవైపు.. వన్‌ప్లస్ ఫిబ్రవరి 7న (OnePlus 11) లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందు Amazon OnePlus 10 Pro 5Gపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది.

OnePlus 10 Pro 5G : అమెజాన్‌లో వన్‌ప్లస్ 10ప్రో 5G ఫోన్‌పై రూ. 6,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్.. ఇప్పుడే కొనుక్కోండి.. డోంట్ మిస్..!

OnePlus 10 Pro 5G Sale _ OnePlus 10 Pro 5G selling with an instant discount of Rs 6000 on Amazon

OnePlus 10 Pro 5G Sale : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ (Amazon) భారీ డీల్స్ అందిస్తోంది. మరోవైపు.. వన్‌ప్లస్ ఫిబ్రవరి 7న (OnePlus 11) లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందు Amazon OnePlus 10 Pro 5Gపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. వన్‌ప్లస్ 10 Pro 5G ఫోన్ భారత మార్కెట్లో మార్చి 23, 2022న లాంచ్ అయింది. ఇప్పుడు వన్‌ప్లస్ 10ప్రో స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. అమెజాన్ కొనుగోలుదారులు ఈ ఫోన్‌పై రూ. 6000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో (OnePlus 10 Pro 5G) సొంతం చేసుకోవచ్చు. అదనంగా, కొనుగోలుదారులు రూ. 1000 డిస్కౌంట్ కూపన్‌ కూడా పొందవచ్చు. డీల్‌ను మరింత తగ్గించడానికి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

వన్‌ప్లస్ 10ప్రోపై డీల్స్ :
OnePlus 10 Pro 5G ఫోన్ 8GB వేరియంట్ ధర రూ.66,900 ఉండగా, 12GB వేరియంట్ ధర రూ.71,900గా ఉంది. OnePlus 10 Pro 5G 8GB వేరియంట్‌కు రూ. 61,999, 12GB వేరియంట్ ధర రూ. 66,999 వద్ద అందుబాటులో ఉంది. మీరు ICICI బ్యాంక్ యూజర్ అయితే.. మీరు డివైజ్‌పై రూ. 6వేల ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు.

Read Also : OnePlus 7 Software Update : వన్‌ప్లస్ 7 యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రెండు మోడళ్లకు సాఫ్ట్‌వేర్ సపోర్టు ఉండదు.. కొత్త ఫోన్ కొనడమే బెటర్..!

దాంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.59,999కి తగ్గనుంది. అదనంగా, వన్‌ప్లస్కొనుగోలుదారులు OnePlus 10 Pro 5Gపై రూ. 1000 తగ్గింపును పొందవచ్చు. ఈ డీల్‌ మరింత తగ్గాలంటే కొనుగోలుదారులు రూ. 15వేల వరకు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ వోల్కానిక్ బ్లాక్, ఎమరాల్డ్ బ్లాక్ ఫారెస్ట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

OnePlus 10 Pro 5G Sale _ OnePlus 10 Pro 5G selling with an instant discount of Rs 6000 on Amazon

OnePlus 10 Pro 5G Sale _ OnePlus 10 Pro 5G selling with an instant discount

వన్‌ప్లస్10 Pro 5G స్పెసిఫికేషన్‌లివే :
OnePlus 10 Pro 5G 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. P3 కలర్లకు సపోర్టు ఇచ్చే LTPO టెక్నాలజీని ఉపయోగిస్తుంది. 3216 × 1440 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. డిస్ప్లే 120Hz అధిక రిఫ్రెష్ రేట్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. OnePlus 10 Pro Qualcomm Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌తో పాటు గరిష్టంగా 12GB RAM, 256GB స్టోరేజీతో అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ ఆక్సిజన్‌OSతో కస్టమైజ్ చేసిన ఆండ్రాయిడ్ 12పై రన్ అవుతుంది.

ఆప్టిక్స్ పరంగా.. OnePlus 10 Pro ప్రత్యేకమైన 48-MP Sony IMX789 సెన్సార్‌ను కలిగి ఉంది. అల్ట్రా-వైడ్ కెమెరా 50-MP శాంసంగ్ Samsung ISOCELL JN1 సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. టెలిఫోటో కెమెరా 8-MP సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో సోనీ IMX615 సెన్సార్‌తో 32-MP కెమెరా ఉంది. OnePlus 10 Pro 5G మోడల్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. వన్‌ప్లస్ 10 Pro 5G ఫోన్ మెరుగైన టెలిఫోటో కెమెరా, రిఫ్రెష్ డిజైన్, (అధికారిక) IP68 రేటింగ్, తక్కువ ప్రత్యేకమైన ఫీచర్లతో రానుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : OnePlus Nord 3 Phone : వచ్చే జూన్‌లోనే వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!