OnePlus Nord 3 Phone : వచ్చే జూన్‌లోనే వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

OnePlus Nord 3 Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. OnePlus 11 ఫోన్ లాంచ్ చేసిన తర్వాత మిడ్-రేంజర్ మోడల్ OnePlus Nord 3 ఫోన్ లాంచ్ చేయనుంది.

OnePlus Nord 3 Phone : వచ్చే జూన్‌లోనే వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

OnePlus Nord 3 may launch in India in June 2023 _ Here’s everything we know

OnePlus Nord 3 Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. OnePlus 11 ఫోన్ లాంచ్ చేసిన తర్వాత మిడ్-రేంజర్ మోడల్ OnePlus Nord 3 ఫోన్ లాంచ్ చేయనుంది. నివేదికల ప్రకారం.. OnePlus ఇప్పుడు భారత మార్కెట్లో OnePlus Nord 3ని టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. ఈ ఫోన్‌కు ‘Larry’ అనే కోడ్ నేమ్ పెట్టారు. ఈ ఏడాది జూన్‌లో నార్డ్ 3 భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

OnePlus కంపెనీ గతంలో OnePlus Nord 2Tని భారత మార్కెట్లో జూలై 2022లో లాంచ్ చేసింది. MySmartPrice ప్రకారం.. OnePlus Nord 3 భారత్‌లో టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫోన్‌కు ‘Larry’ అనే కోడ్‌నేమ్ ఉంది. జూన్ లేదా జూలైలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. OnePlus ఇంతకుముందు అన్ని నార్డ్ డివైజ్‌ల ధరను రూ. 30వేల లోపు ప్రకటించింది. Nord 3తో బ్రాండ్ అదే పద్ధతిని కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. OnePlus ఫీచర్లకు సంబంధించి Nord సిరీస్ బాగా పాపులర్ అయిందనే చెప్పాలి.

Read Also :  Reliance Jio 5G Services : 88 భారతీయ నగరాల్లో జియో 5G సర్వీసులు.. నగరాల పూర్తి జాబితా ఇదే.. మీ ఫోన్‌లో జియో 5G యాక్టివేట్ చేసుకోవాలంటే?

వన్‌ప్లస్ Nord 3 ఫీచర్లు (అంచనా) :
వన్‌ప్లస్ Nord 3 Full HD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. డిస్‌ప్లేకు అధిక రిఫ్రెష్ రేట్ సపోర్టును అందించవచ్చు. హుడ్ కింద OnePlus Nord 3లో సాధారణ 4,500mAh బ్యాటరీ ఉండవచ్చు. రాబోయే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కెమెరా విభాగంలో OnePlus Nord 3 ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చు. ఇందులో 50-MP Sony IMX766 సెన్సార్, 8-MP సెకండరీ కెమెరా, 2-MP తృతీయ సెన్సార్ ఉండవచ్చు. ముందు భాగంలో, 16-MP స్నాపర్ ఉండవచ్చు.

OnePlus Nord 3 may launch in India in June 2023 _ Here’s everything we know

OnePlus Nord 3 may launch in India in June 2023

OnePlus Nord 2T స్పెషిఫికేషన్ల మాదిరిగానే OnePlus Nord 2T 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 6.43-అంగుళాల Full HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. AMOLED ప్యానెల్‌తో డిస్‌ప్లే HDR 10+ సర్టిఫికేషన్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. యూజర్లు తమ ఫోన్‌లో అధిక క్వాలిటీ కంటెంట్‌ని చూసేందుకు వీలు కల్పిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త MediaTek డైమెన్సిటీ 1300 చిప్‌సెట్ నుంచి రానుంది. గరిష్టంగా 12GB RAM, 256GB వరకు స్టోరేజీ ఆప్షన్ అందిస్తుంది.

వన్‌ప్లస్ Nord 2T 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగంలో, OnePlus Nord 2T ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. OIS సపోర్టుతో 50-MP Sony IMX766 ప్రైమరీ కెమెరా ఉంది. 8-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2-MP ట్రిపుల్ సెన్సార్‌తో రానుంది. ఫ్రంట్ సైడ్ వీడియోలను క్యాప్చర్ చేసేందుకు EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 32-MP కెమెరా కూడా ఉండొచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : OnePlus 7 Software Update : వన్‌ప్లస్ 7 యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రెండు మోడళ్లకు సాఫ్ట్‌వేర్ సపోర్టు ఉండదు.. కొత్త ఫోన్ కొనడమే బెటర్..!