Oscar 2023 : ఇండియన్ హిస్టరీలో ఆస్కార్‌కి నామినేట్ అయిన సినిమాలు ఇవే..

ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్ అందుకోడం జీవిత సాఫల్యంగా భావిస్తారు ప్రపంచ సినీ నటులు మరియు సాంకేతిక నిపుణులు. అలాంటి పురస్కారం కేవలం నామినేషన్స్ లో నిలిచినా చాలు అని అనుకుంటారు. కాగా ఇండియన్ హిస్టరీలో ఇప్పటి వరకు పలు కేటగిరీలో అనేక సినిమాలు నామినేషన్స్ నిలిచి ఆస్కార్ కోసం పోటీ పడ్డాయి.

Oscar 2023 : ఇండియన్ హిస్టరీలో ఆస్కార్‌కి నామినేట్ అయిన సినిమాలు ఇవే..

oscar nominated indian films in all categories list in telugu

Oscar 2023 : ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్ అందుకోడం జీవిత సాఫల్యంగా భావిస్తారు ప్రపంచ సినీ నటులు మరియు సాంకేతిక నిపుణులు. అలాంటి పురస్కారం కేవలం నామినేషన్స్ లో నిలిచినా చాలు అని అనుకుంటారు. ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్ లో భారతదేశం నుంచి మూడు చిత్రాలు పోటీ పడుతున్నాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో RRR, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌ కేటగిరీలో ఆల్ దట్ బ్రీత్స్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌ కేటగిరీలో ది ఎలిఫెంట్ విస్ఫర్స్ ఆస్కార్ రేస్ లో నిలిచాయి. కాగా ఇండియన్ హిస్టరీలో ఇప్పటి వరకు పలు కేటగిరీలో అనేక సినిమాలు నామినేషన్స్ నిలిచి ఆస్కార్ కోసం పోటీ పడ్డాయి.

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం నామినేషన్స్‌లో నిలిచిన సినిమాలు..

మదర్ ఇండియా : మొట్ట మొదటిసారిగా 1958లో భారతదేశం తరుపు నుంచి ‘మదర్ ఇండియా’ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో నిలిచింది. ఒక భారతీయ తల్లి తన పిల్లలు కోసం, తన కుటుంబం కోసం పడే కష్టాలను మరియు దేశంలోని గ్రామ పరిస్థితులను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తూనే గుండెకు హత్తుకునేలా చిత్రీకరించారు.

Oscars 2023 : ఆస్కార్ లో ఈ సంవత్సరం అత్యధిక నామినేషన్స్ దక్కించుకున్న సినిమాలు ఇవే..

సలాం బాంబే : దాదాపు 31 ఏళ్ళ తరువాత బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం నామినేషన్స్‌లో మరో భారతీయ సినిమా చోటు దక్కించుకుంది. ‘సలాం బాంబే’ అనే సినిమా 1989 ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. ముంబై మురికివాడలో నివసించే విధి పిల్లల జీవితాలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

లగాన్ : ఆ తరువాత 2002లో అమీర్ ఖాన్ ‘లగాన్’ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచింది. అసలు క్రికెట్ అంటే కూడా తెలియని భారతీయ గ్రామస్తులు పన్ను మినహాయింపు కోసం బ్రిటిషర్స్ తో క్రికెట్ మ్యాచ్ ఆడి ఎలా ఆ మ్యాచ్ గెలిచారు అనేది ఈ సినిమా కథ.

బెస్ట్ పిక్చర్ నామినేషన్స్‌లో నిలిచిన సినిమాలు..

A Room With a View : 1987 లో భారతదేశానికి చెందిన ఇస్మాయిల్ మర్చంట్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘ఏ రూమ్ విత్ ఏ వ్యూ’ అనే ఒక బ్రిటిష్ రొమాంటిక్ ఫిల్మ్ ఆస్కార్ కి బెస్ట్ పిక్చర్ నామినేషన్స్‌లో నిలిచింది.

Oscar 2023 : 62 ఏళ్ళ ట్రెడిషన్‌ని బ్రేక్ చేసిన ఆస్కార్.. రంగు మార్చుకున్న కార్పెట్!

Howards End : 1993 లో ఇస్మాయిల్ మర్చంట్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన మరో ఇంగ్లీష్ మూవీ ‘హోవర్డ్స్ ఎండ్’ బెస్ట్ పిక్చర్ గా నామినేట్ అయ్యింది.

The Remains of the Day : ఆ తరువాత సంవత్సరం కూడా ఇస్మాయిల్ మర్చంట్స్ ‘ది రిమైన్స్ ఆఫ్ ది డే’ సినిమాతో ఆస్కార్ బరిలో నిలిచింది.

బెస్ట్ షార్ట్ ఫిల్మ్ నామినేషన్స్‌లో నిలిచిన సినిమాలు..

The Creation of Woman : ఇస్మాయిల్ మర్చంట్స్ నిమరించిన ‘ది క్రియేషన్ ఆఫ్ ఉమెన్’ బెస్ట్ షార్ట్ సబ్జెక్ట్ (లైవ్ యాక్షన్) గా 1961 లో నామినేట్ అయ్యింది.

Bead Games : యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌గా 1978 లో ‘బీడ్ గేమ్స్’ నామినేట్ అయ్యింది.

Little Terrorist : 2005 లో ‘లిటిల్ టెర్రరిస్ట్’ బెస్ట్ షార్ట్ సబ్జెక్ట్ (లైవ్ యాక్షన్) గా నామినేట్ అయ్యింది.

బెస్ట్ డాక్యుమెంటరీ నామినేషన్స్‌లో నిలిచిన సినిమాలు..

The House That Ananda Built : ప్రముఖ ఇండియన్ సినిమాటోగ్రాఫర్ ఫాలీ బిలిమోరియా తెరకెక్కించిన ‘ది హౌస్ దట్ ఆనంద బిల్ట్’ 1969 లో బెస్ట్ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్)కి ఎంపికైంది.

Oscar 2023 : ఆస్కార్ నామినేషన్స్ ఫుల్ లిస్ట్ ఇదే..

An Encounter with Faces : 1979 లో ‘యాన్ ఎన్‌కౌంటర్ విత్ ఫేసెస్’ బెస్ట్ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్)కి నామినేట్ అయ్యింది.

Writing with Fire : ‘రైటింగ్ విత్ ఫైర్’ అనే ఫిల్మ్ 2022 లో బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింగా నామినేషన్స్ నిలిచింది.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అండ్ స్కోర్ నామినేషన్స్‌లో నిలిచిన సినిమాలు..

Gandhi : గాంధీ సినిమాకు గాను 1983 లో పండిట్ రవి శంకర్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో నామినేట్ అయ్యాడు.

Slumdog Millionaire : 2009 లో స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా నుంచి ‘ఓ సాయా’, ‘జయహో’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కి నామినేట్ కాగా.. ‘జయహో’ ఆస్కార్ అవార్డుని అందుకుంది.

127 Hours : ఎ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కిన 127 Hours సినిమాలోని ‘ఇఫ్ ఐ రైజ్’ సాంగ్ 2011 లో ఆస్కార్ కి నామినేట్ అయ్యింది.

Life of Pi : 2013 లో లైఫ్ అఫ్ పై సినిమాలోని ‘పైస్ లాలిపాట’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కి నామినేట్ అయ్యింది.

Oscar 2023 : ఆస్కార్ అమ్ముకోవచ్చు తెలుసా.. అమ్మితే వచ్చే రేటు తెలిస్తే షాక్ అవుతారు!

పైన చెప్పిన అన్ని కేవలం నామినేట్ అయ్యినవే. ఇప్పటివరకు ఆస్కార్ గెలుచుకున్నది 6 భారతీయులు. భాను అతైయా (బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్), సత్యజిత్ రే (అకాడమీ హానరరీ), రెసుల్ పూక్కుట్టి (బెస్ట్ సౌండ్ మిక్సింగ్), గుల్జార్ (బెస్ట్ ఒరిజినల్ సాంగ్), ఎ ఆర్ రెహమాన్ (బెస్ట్ ఒరిజినల్ సాంగ్), గునీత్ మోంగా (బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం) ఆస్కార్ అందుకున్నారు. అయితే ఈ అవార్డులు అన్ని ఇంగ్లీష్ సినిమాలకు వర్క్ చేసి గెలుచుకున్నవి.