Oscar 2023 : ఆస్కార్ అమ్ముకోవచ్చు తెలుసా.. అమ్మితే వచ్చే రేటు తెలిస్తే షాక్ అవుతారు!

ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్. కాగా బంగారు పూతతో మెరిసిపోయే ఆస్కార్ అవార్డుని అమ్ముకోవచ్చా అంటే? అవును అమ్ముకోవచ్చు. అయినా అంత ప్రతిష్టాత్మకమైన అవార్డుని ఎవడైనా అమ్ముకుంటాడా? అని అనుకుంటున్నారా. నిజం ఇది ఒకసారి జరిగింది.

Oscar 2023 : ఆస్కార్ అమ్ముకోవచ్చు తెలుసా.. అమ్మితే వచ్చే రేటు తెలిస్తే షాక్ అవుతారు!

oscar award will be purchase if the winner wants

Oscar 2023 : ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్. ఈ అవార్డు అందుకోడమే కాదు నామినేషన్స్ లో నిలవడం కూడా గొప్పగా భావిస్తారు ప్రపంచ సినీ సాంకేతిక నిపుణులు. మరికొద్ది గంటల్లో 95వ ఆస్కార్ అవార్డ్స్ మొదలు కానున్నాయి. ఇప్పటికే హాలీవుడ్ హుంగామా మొదలైంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సినీ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్చి 12 రాత్రి ఆస్కార్ అవార్డ్స్ మొదలు కానున్నాయి. ఇండియన్ టైం ప్రకారం మార్చి 13 ఉదయం 5:30 గంటల నుంచి ఈ వేడుక మొదలు కాబోతుంది.

Oscar 2023 : ప్రియాంక చోప్రా ప్రీ ఆస్కార్ పార్టీ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ సందడి..

కాగా బంగారు పూతతో మెరిసిపోయే ఆస్కార్ అవార్డుని అమ్ముకోవచ్చా అంటే? అవును అమ్ముకోవచ్చు. అయినా అంత ప్రతిష్టాత్మకమైన అవార్డుని ఎవడైనా అమ్ముకుంటాడా? అని అనుకుంటున్నారా. నిజం ఇది ఒకసారి జరిగింది. బంగారు పూతతో మెరిసి పోయే ఆస్కార్ బంగారంతో చేసింది కాదు. కాంస్యం చేసి దాని పై 24 కారెట్స్ గోల్డ్ తో పూత పూస్తారట. దీని తయారు చేయడానికి 400 డాలర్లు ఖర్చు అవుతుంది. 1950కు ముందు ఆస్కార్ పొందిన అమెరికన్ డైరెక్టర్ ఆర్సన్ వెల్స్ ఆర్ధిక ఇబ్బందులు వల్ల ఆస్కార్ అమ్ముకోడానికి ప్రయత్నించాడట.

Oscar 2023 : ఆస్కార్‌‌కి ఎన్టీఆర్, చరణ్‌లు మాత్రమే కాదు జాక్వెలిన్ కూడా తన సాంగ్‌తో పోటీ పడుతుంది.. తెలుసా?

ఈ నేపథ్యంలోనే ఆ అవార్డుని వేలానికి పెట్టడంతో, దాదాపు ఆరున్నర కోట్లు వచ్చాయట. అయితే ఈ విషయం పై అకాడమీ సీరియస్ అయ్యింది. మరెవరు అటువంటి పనికి పాల్పడకుండా అవార్డ్స్ లో ఒక నిబంధన తీసుకు వచ్చింది. అవార్డు గెలుచుకున్న వారు ఎవరైనా దానిని అమ్ముకోవాలి అనుకుంటే.. దానిని అకాడమీకి మాత్రమే అమ్మాలి అనే రూల్ తీసుకు వచ్చింది. అయితే ఆ అవార్డుని అకాడమీ కొనేది ఎంత ధరకో తెలుసా? కేవలం 1 డాలర్ ధరను మాత్రమే నిర్ణయించింది. దీంతో ఎవరు ఒక 1 డాలర్ కి ఆస్కార్ ని అమ్ముకోవాలని చూడరు అనే ఉద్దేశంతో అకాడమీ ఈ రూల్ తీసుకు వచ్చింది.