Oscar 2023 : 62 ఏళ్ళ ట్రెడిషన్‌ని బ్రేక్ చేసిన ఆస్కార్.. రంగు మార్చుకున్న కార్పెట్!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి ద్రుష్టి.. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే ఆస్కార్ అవార్డ్స్ వేడుక పైనే ఉంది. కాగా ఆస్కార్ వేడుకలో రెడ్ కార్పెట్ పై నడవడానికి ప్రతిఒక్కరు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. రెడ్ కార్పెట్ పై పోజులు ఇవ్వడానికి ప్రత్యేకమైన డిజైన్ వేర్ తో మెరిసిపోతుంటారు. అయితే..

Oscar broke the 62 year old tradition by changing carpet colour red to champagne
Oscar 2023 : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి ద్రుష్టి.. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే ఆస్కార్ అవార్డ్స్ వేడుక పైనే ఉంది. ఈ ఏడాది ఆస్కార్ ని ఎవరు అందుకుంటారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక భారతదేశంలోని చాలా మంది కూడా ఈ సంవత్సరం జరగబోయే ఆస్కార్స్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు కారణం RRR చిత్రం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచింది. ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించిన ఈ పాట ఆస్కార్ గెలవడం పక్కా అంటూ హాలీవుడ్ మీడియా సైతం వార్తలు రాసుకు రావడంతో.. ఆస్కార్ పై ఇండియన్స్ లో ఆశలు చిగురించాయి.
Oscar 2023 : ఆస్కార్ నామినేషన్స్ ఫుల్ లిస్ట్ ఇదే..
ఇక మార్చి 12న (IST మార్చి 13 మార్నింగ్ 5:30 PM) జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ వస్తారు. కాగా ఆస్కార్ వేడుకలో రెడ్ కార్పెట్ పై నడవడానికి ప్రతిఒక్కరు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. రెడ్ కార్పెట్ పై పోజులు ఇవ్వడానికి ప్రత్యేకమైన డిజైన్ వేర్ తో మెరిసిపోతుంటారు. అయితే ఈ ఏడాది ఈ కార్పెట్ రంగు మార్చుకోబోతుంది. రెడ్ కార్పెట్ కాస్త షాంపైన్ రంగులోకి మారిపోయింది. రంగు మార్చడం గురించి అకాడమీ కచ్చితమైన రీజన్ అయితే వెల్లడించలేదు.
Oscar 2023 : ఆస్కార్ అమ్ముకోవచ్చు తెలుసా.. అమ్మితే వచ్చే రేటు తెలిస్తే షాక్ అవుతారు!
ఆస్కార్ లో రెడ్ కార్పెట్ సంప్రదాయం 1961 నుంచి మొదలైంది. అప్పటి నుంచి గత ఏడాది వరకు ఈ ట్రేడిషన్ ఫాలో అవుతూనే వచ్చింది అకాడమీ. కానీ ఈ ఏడాది తన 62 ఏళ్ళ ట్రెడిషన్‌ని బ్రేక్ చేస్తూ.. అతిథులు కోసం రెడ్ బదులు షాంపైన్ కార్పెట్ పరుస్తుంది. మరి ఈ షాంపైన్ కార్పెట్ పై తారల అందాలు ఎంతలా మెరబోతున్నాయో చూడాలి. కాగా ఈ కార్యక్రమాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రత్యేక్ష ప్రసారం చూడవచ్చు.