Bheemla Nayak Title Song : ‘భీం భీం భీం భీం భీమ్లా నాయక్.. దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్’..

పవర్‌స్టార్ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ క్యారెక్టరైజేషన్‌ని వివరిస్తూ సాగిన ఈ పాట ఆద్యంతం ఆసక్తికరంగా.. ఫ్యాన్స్‌కి ఊపునిచ్చేలా ఉంది..

Bheemla Nayak Title Song : ‘భీం భీం భీం భీం భీమ్లా నాయక్.. దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్’..

Bheemla Nayak Title Song

Bheemla Nayak Title Song: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో  ‘భీమ్లా నాయక్’ తెరకెక్కుతోంది. టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను.. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ రీమేక్ చేస్తున్నారు. పవన్ పక్కన నిత్యా మీనన్, రానా సరసన ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నారు.

Pawan Kalyan : పవర్‌స్టార్.. క్రేజ్‌కి కేరాఫ్..

సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ సాంగ్‌ను పవన్‌తో ‘హరి హర వీర మల్లు’ సినిమా చేస్తున్న డైరెక్టర్ క్రిష్ రిలీజ్ చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. థమన్, శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్ మిర్యాల చాలా చక్కగా పాడారు.

Pawan Kalyan : ఇదీ పవర్‌స్టార్ స్టామినా.. అప్పుడు 5 వేలు.. ఇప్పుడు 50 కోట్లు..

ఈ సినిమాలో పవర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఆయన చేస్తున్న ‘భీమ్లా నాయక్’ క్యారెక్టరైజేషన్‌ని వివరిస్తూ సాగిన ఈ పాట ఆద్యంతం ఆసక్తికరంగా.. ఫ్యాన్స్‌కి ఊపునిచ్చేలా ఉంది.

Pawan Kalyan : క్లీన్ స్మాష్.. ‘భీమ్లా నాయక్’ ఆల్ టైమ్ టాప్ 1 రికార్డ్..

‘‘ఆడా గాదు.. ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రం నీళ్లా గుట్టాకాడ.. అలుగూ వాగు తాండాలోన బెమ్మాజెముడు చెట్టున్నాది.. భీం భీం భీం భీం భీమ్లానాయక్.. బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్.. భీం భీం భీం భీం భీమ్లా నాయక్.. దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్’’.. అంటూ రామజోగయ్య రాసిన లిరిక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 2022 జనవరి 12న ‘భీమ్లా నాయక్’ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సాంగ్ మీరూ ఓసారి వినేయండి.