Pawan Kalyan: ఉగాది గిఫ్ట్‌ను రెడీ చేస్తోన్న పవన్.. వీరమల్లు కాదండోయ్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో పవన్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాతో పాటు తమిళ నటుడు కమ్ డైరెక్టర్ సముథ్రఖని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి పవన్ ఓ సినిమా చేస్తున్నాడు.

Pawan Kalyan: ఉగాది గిఫ్ట్‌ను రెడీ చేస్తోన్న పవన్.. వీరమల్లు కాదండోయ్!

Pawan Kalyan Sai Dharam Tej Movie Update On The Way

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో పవన్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాతో పాటు తమిళ నటుడు కమ్ డైరెక్టర్ సముథ్రఖని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి పవన్ ఓ సినిమా చేస్తున్నాడు.

Pawan Kalyan : ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ చేస్తున్న పవర్ స్టార్.. టార్గెట్ 2024.. అన్ని సినిమాలు అయిపోవాలి..

ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా నుండి అప్పుడే ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. ఉగాది కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను అనౌన్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘వినోదయ సీతం’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Pawan Kalyan : ఆ ఇద్దరు హీరోలకు సారీ చెప్పిన పవన్ కళ్యాణ్..

ఇక ఈ సినిమాలో అందాల భామలు కేతిక శర్మ, ప్రియాంక జావల్కర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా నుండి అప్పుడే అప్డేట్ కూడా వస్తుండటంతో, హరిహర వీరమల్లు నుండి అప్డేట్ ఇవ్వాల్సిందిగా పవన్ ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి నిజంగానే ఉగాది కానుకగా పవన్, సాయి ధరమ్ తేజ్ మూవీ అప్డేట్ రానుందా అనేది చూడాలి.