PawanKalyan28: ‘భవదీయుడు భగత్ సింగ్’.. అదిరిపోయిన పవన్ మాస్ లుక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో మాస్ లుక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. పవన్ ఫాన్స్ సహా తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

PawanKalyan28: ‘భవదీయుడు భగత్ సింగ్’.. అదిరిపోయిన పవన్ మాస్ లుక్!

Pawankalyan28

PawanKalyan28: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో మాస్ లుక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. పవన్ ఫాన్స్ సహా తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్ సినిమా లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ఖరారవగా గురువారం ఉదయం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో ‘భవదీయుడు భగత్ సింగ్’గా పవన్ మాస్ లుక్ అదిరిపోయింది.

Big Boss 5: హౌస్‌లో ఫస్ట్ లవ్ స్టోరీ.. సిగ్గు మొగ్గలేస్తున్న ప్రియాంకా!

భగత్ సింగ్ అంటే స్వాతంత్ర్య పోరాట యోధుడిగా ఒక రెబల్ ఐకాన్. ఇక భవదీయుడు అనే పదంలో ఓ రకమైన వినమ్రత, సౌమ్యం కనిపిస్తోంది. ఈ రెండూ కలిపి టైటిల్ గా పెట్టారు మేకర్స్. ఈ డిఫరెంట్ టైటిల్ అభిమానుల‌కి పిచ్చిపిచ్చిగా న‌చ్చేసింది. ఇక ఫ‌స్ట్ లుక్‌లో ప‌వ‌న్ బైక్‌పై కూర్చొని టీ తాగుతూ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుండగా.. పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.

Big Boss 5: జెస్సీ-అనీ మధ్య ఫైటింగ్.. చివరికి జెస్సీ కాళ్లబేరం

నిజానికి కొద్ది రోజుల క్రితం సమావేశమైన ఈ సినిమా యూనిట్ త్వరలో షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు కూడా ప్రకటన చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇక గతంలో పవన్-హరీశ్ శంకర్ కాంబినేషన్ లో ‘గబ్బర్ సింగ్’ బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టగా ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలను తగ్గట్లే ఫస్ట్ లుక్ లోనే హరీష్ పవర్ స్టార్ ను ఎలా చూడాలని అభిమానులు ఆశపడతారో అదే రేంజిలో చూపించాడు. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఏమో ఇక!