Big Boss 5: హౌస్‌లో ఫస్ట్ లవ్ స్టోరీ.. సిగ్గు మొగ్గలేస్తున్న ప్రియాంకా!

ఇప్పటి వరకు జరిగిన నాలుగు బిగ్ బాస్ సీజన్లలో గత రెండు సీజన్లు హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య ఫైటింగ్స్, లవ్ ట్రాక్స్ బాగా హైలెట్ అయిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా..

Big Boss 5: హౌస్‌లో ఫస్ట్ లవ్ స్టోరీ.. సిగ్గు మొగ్గలేస్తున్న ప్రియాంకా!

Big Boss 5

Big Boss 5: ఇప్పటి వరకు జరిగిన నాలుగు బిగ్ బాస్ సీజన్లలో గత రెండు సీజన్లు హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య ఫైటింగ్స్, లవ్ ట్రాక్స్ బాగా హైలెట్ అయిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా గత సీజన్ లో మోనాల్ నడిపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే మరింత హైలెట్ గా మారింది. ఇక, ఇప్పుడు నడిచే సీజన్ నిండా మొదలై మూడు ఎపిసోడ్లు కాలేదు కానీ.. అప్పుడే గొడవలు, ఈగోలు, వివాదాలు మొదలైపోయాయి. ఒకేసారి 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు.

PawanKalyan28: ‘భవదీయుడు భగత్ సింగ్’.. అదిరిపోయిన పవన్ మాస్ లుక్!

వివాదాలు, ఈగోలే కాదు లవ్ స్టోరీలు కూడా మొదలవుతున్నాయి. సీజన్ ప్రారంభమైన మూడు రోజుల్లోనే ఓ లవ్ స్టోరీ బయటికి రావడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఈసీజన్ లో హౌస్‌లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్స్‌కు పెళ్లయింది. 19 మందిలో కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే సింగిల్స్ గా ఉన్నారు. ఇందులో ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక సింగ్‌ హౌస్‌లో ఉన్న మేల్ కంటెస్టెంట్లందరిని అన్నయ్య అని పిలిచేసింది కానీ.. ఒక్క మానస్ ను మాత్రం అన్నయ్య అనలేదు సరికదా సిగ్గుమొగ్గలేస్తుంది.

Big Boss 5: జెస్సీ-అనీ మధ్య ఫైటింగ్.. చివరికి జెస్సీ కాళ్లబేరం

అంతేకాదు మరికాస్త ముందుకెళ్లిన ప్రియాంకా తనకు మానస్‌పై క్రష్ ఉందని ఓపెన్‌గా చెప్పేసింది. అందుకే మానస్‌ని మాత్రం అలా పిలవలేదని సిగ్గుపడిపోతుంది. ఇప్పటికే హౌస్‌లోని మిగతా సభ్యులంతా ప్రియాంక-మానస్‌లది ఈ సీజన్ తొలి జోడీ అంటూ ఆటపట్టిస్తున్నారు. మరీ మున్ముందు ఈ జోడీ కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో.. ఈ సీజన్ లో ఈ జోడికి మరెవరైనా పోటీకి వస్తారా.. మానస్ ప్రియాంకాను దగ్గర చేసుకుంటాడా.. లేక ట్రాన్స్ జెండర్ అనే కారణంగా దూరం పెడతాడా అన్నది చూడాలి.