Big Boss 5: జెస్సీ-అనీ మధ్య ఫైటింగ్.. చివరికి జెస్సీ కాళ్లబేరం

బిగ్ బాస్ సీజన్ మొదలవడమే కాదు.. ఆ ఇంట్లో రచ్చ కూడా అప్పుడే మొదలైంది. సాధారణంగా హౌస్‌లో కాంట్రవర్సీలు, కొట్లాటలు ఏ రేంజ్‌‌లో ఉంటాయో తెలిసిందే.

Big Boss 5: జెస్సీ-అనీ మధ్య ఫైటింగ్.. చివరికి జెస్సీ కాళ్లబేరం

Big Boss 5

Big Boss 5: బిగ్ బాస్ సీజన్ మొదలవడమే కాదు.. ఆ ఇంట్లో రచ్చ కూడా అప్పుడే మొదలైంది. సాధారణంగా హౌస్‌లో కాంట్రవర్సీలు, కొట్లాటలు ఏ రేంజ్‌‌లో ఉంటాయో తెలిసిందే. ఈసారి ఏకంగా 19 మందిని ఇంట్లోకి పంపడంతో రచ్చ మొదలు కావడానికి పెద్ద టైం కూడా పట్టలేదు. మూడవ ఎపిసోడ్ కే కంటెస్టంట్ల మధ్య మెల్లగా గొడవలు మొదలయ్యాయి. గ్రూపులుగా ఉండటం హౌస్ మెట్స్ తో గొడవలకు దిగడం అంత ఓ రేంజ్ లో సాగుతుంది. పూర్తి పరిచయాలు కూడా పెరగనేలేదు అంతలోనే శత్రువులు అవుతున్నారు కంటెస్టెంట్ లు.

Big Boss 5: హౌస్‌లో ఫస్ట్ లవ్ స్టోరీ.. సిగ్గు మొగ్గ లేస్తున్న ప్రియాంకా!

బుధవారం రోజు ప్రసారమైన ఎపిసోడ్ లో ఒక లవ్ ట్రాక్ తో పాటు ఒక ఫైటింగ్ కూడా హైలెట్ అయింది. సాధారణంగా ఎప్పుడూ సైలెంట్ గా ఉండే జెస్సీ వైలెంట్ అయ్యాడు. జెస్సీ కుర్చీలో కాలు అడ్డు పెట్టడంతో ఆనీ మాస్టర్ వచ్చి కాలు తీయమని అనడం.. జెస్సీ ఆనీ మాస్టర్ మాటలను పట్టించుకోకుండా ఓవర్ చేయడంతో ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్లిన అనీ మాస్టర్ ఆమె బెడ్ మీదకి చేరి కాస్త ఎమోషన్ అయింది. దీంతో ప్రేక్షకులు అనీ మీద అయ్యో పాపం అనే ఫీల్ లోకి వెళ్లారు.

PawanKalyan28: ‘భవదీయుడు భగత్ సింగ్’.. అదిరిపోయిన పవన్ మాస్ లుక్!

కానీ, జెస్సీ అంతలోనే జెస్సీ ఆనీ మాస్టర్ దగ్గరికి వచ్చి క్షమాపణలు కోరాడు. అంతేకాకుండా ఆమె కాళ్ళు కూడా పట్టుకుని క్షమించమని కోరడంతో వారిద్దరి మధ్య ఉన్న గొడవ పూర్తిగా సద్దుమణిగింది. అయితే.. అప్పటికే జెస్సీ మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. జెస్సీని ఇన్నాళ్లు అమాయకుడని అనుకున్నాం కానీ అసలు రూపం ఏంటో బయటపడింది అంటూ నెట్టింట్లో తెగ కామెంట్లు చేస్తున్నారు. జెస్సీ అసలు క్యారెక్టర్ ఇదేనని.. కాకపోతే మళ్లీ తనపై ప్రేక్షకులనుండి నెగటివ్ వస్తుందేమో అని వెంటనే క్షమాపణలు కోరాడని కామెంట్లు చేస్తున్నారు.